ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ అమలు లోటు భర్తీకి ఆప్షన్ -1 ఎంచుకున్న మరో రెండు రాష్ట్రాలు – కేరళ, పశ్చిమబెంగాల్
ఆప్షన్ -1 ను ఎంచుకున్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
జీఎస్టీ అమలు లోటు భర్తీకి రూ. 10,197 కోట్లు పొందనున్న కేరళ, పశ్చిమబెంగాల్ అదనంగా రూ. 11,309 కోట్లు సేకరించేందుకు కూడా ఈ రెండు రాష్ట్రాలకు అనుమతి
Posted On:
25 NOV 2020 5:14PM by PIB Hyderabad
జీ ఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన లోటు భర్తీకి ఆప్షన్-1 కు కేరళ, పశ్చిమ బెంగాల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆమోదాన్ని తెలియజేశాయి. దీంతో ఇప్పటివరకు ఆప్షన్ -1 ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 25 కు చేరింది. మరో మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ( ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, పాండిచ్చేరి) కూడా ఆప్షన్ -1 కు ఆమోదం తెలిపాయి.
ఈ విధంగా జీస్టీ లోటు భర్తీకి ఆప్షన్ -1- ఎంచుకున్న రాష్ట్రాలు ఆ మొత్తాన్ని ప్రత్యేక రుణం ద్వారా భర్తీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ విధానం 2020 అక్టోబర్ 23 నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వాయిదాలలో 24,000 కోట్లు రుణంగా సేకరించింది. ఈ మొత్తాన్ని ఆప్షన్ -1 ఎంచుకున్న రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23 తేదీలలో అందజేసింది. ఇప్పుడు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిలో వచ్చే రౌండ్ రుణాల నుంచి అందుకుంటాయి.
ఈ ఆప్షన్ కింద జీఎస్టీ అమలుతో ఏర్పడ్డ లోటు భర్తీకి ప్రత్యేక రుణం పొందటంతోబాటు 2020 మే 17న ఆత్మ నిర్భర్ భారత్ కింద కేంద్రం అనుమతించిన అదనపు 2% అప్పులో స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తిలో 0.5% మేర ఆఖరి విడత బేషరతుగా అప్పు పొందటానికి వీలవుతుంది. ఇది 1.1 లక్షల కోట్ల ప్రత్యేక వెసులుబాటుకు అదనం. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్;ఇ ఆప్షన్ 1 పట్ల సానుకూలత ప్రకటించిన నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అదనంగా రుణాలు పొందటానికి అనుమతించింది. కేరళకు ఆ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.5% కింద రూ, 4,522 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు ఆ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.5% కింద రూ..6787 కోట్లు అందే వీలుంది.
25 రాష్ట్రాలకు అనుమతించిన అదనపు ఋణసేకరణ మొత్తం, ప్రత్యేక విధానంలో సేకరించుకోవటానికి అనుమతించిన మొత్తాల వివరాలను అనుబంధంలో జతపరచటమైనది. ఇందులో 25 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాలవారీగా వాటి రాష్ట స్థూల జాతీయోత్పత్తిలో 0.5 శాతం కింద అందుకునే అదనపు రుణాలు, ప్రత్యేక విధానంలో పొందే నిధులు నవంబర్ 23 వరకు ఇలా ఉన్నాయి.
(Rs. in Crore)
S. No.
|
Name of State / UT
|
Additional borrowing of 0.50 percent allowed to States
|
Amount of fund raised through special window passed on to the States/ UTs
|
1
|
Andhra Pradesh
|
5051
|
672.61
|
2
|
Arunachal Pradesh*
|
143
|
0.00
|
3
|
Assam
|
1869
|
289.54
|
4
|
Bihar
|
3231
|
1136.27
|
5
|
Goa
|
446
|
244.39
|
6
|
Gujarat
|
8704
|
2683.88
|
7
|
Haryana
|
4293
|
1266.68
|
8
|
Himachal Pradesh
|
877
|
499.74
|
9
|
Karnataka
|
9018
|
3611.17
|
10
|
Kerala #
|
4,522
|
0.00
|
11
|
Madhya Pradesh
|
4746
|
1321.98
|
12
|
Maharashtra
|
15394
|
3486.24
|
13
|
Manipur*
|
151
|
0.00
|
14
|
Meghalaya
|
194
|
32.51
|
15
|
Mizoram*
|
132
|
0.00
|
16
|
Nagaland*
|
157
|
0.00
|
17
|
Odisha
|
2858
|
1112.42
|
18
|
Rajasthan
|
5462
|
645.06
|
19
|
Sikkim*
|
156
|
0.00
|
20
|
Tamil Nadu
|
9627
|
1816.66
|
21
|
Telangana
|
5017
|
164.41
|
22
|
Tripura
|
297
|
66.04
|
23
|
Uttar Pradesh
|
9703
|
1748.29
|
24
|
Uttarakhand
|
1405
|
674.27
|
25
|
West Bengal #
|
6787
|
0.00
|
|
Total (A):
|
100240
|
21472.16
|
1
|
Delhi
|
Not applicable
|
1706.93
|
2
|
Jammu & Kashmir
|
Not applicable
|
661.21
|
3
|
Puducherry
|
Not applicable
|
159.70
|
|
Total (B):
|
Not applicable
|
2527.84
|
|
Grand Total (A+B)
|
100240
|
24000.00
|
***
(Release ID: 1675721)
Visitor Counter : 153