హోం మంత్రిత్వ శాఖ
తుపాను నివార్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్ఎఫ్) సర్వసన్నద్ధం.
తమిళనాడు ,పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లలో తుపాను ప్రభావం ఉండగల ప్రాంతాలలో ముందస్తు సన్నద్ధతలో భాగంగా 22 బృందాల ఏర్పాటు
జిల్లా , స్థానిక పాలనా యంత్రాంగంతో కలిసి సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్న ఎన్‌డిఆర్ ఎఫ్
Posted On:
24 NOV 2020 6:52PM by PIB Hyderabad
నివార్ తుపాన్ పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటలలో నివార్ తుపాను మరింత బలపడి పెనుతుపానుగా మారి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల మధ్యగల కరైకల్, మామళ్లపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో నవంబర్ 25 వ తేదీ సాయంత్రం తీరంం దాటే అవకాశం ఉంది. ఇది పెనుతుపాను కావడంతో గంలకు 100 నుంచి 110 కిలోమీటర్లనుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు.
తుపాను పరిస్థితులను ఎన్‌డిఆర్ఎఫ్ జాగ్రత్తగా గమనిస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్ఎఫ్) కేంద్ర కార్యాలయం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని ఎన్ డి ఆర్ ఎఫ్ బెటాలియన్ల కమాండెంట్లు ,సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగంతో కలిసి పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. భారత వాతావరణ విభాగం సూచనల ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు కోరిన విధంగా 22 ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు, (12 బృందాలు తమిళనాడు, 3 బృందాలు పుదుచ్చేరి, 7 బృందాలు ఆంధ్రప్రదేశ్‌లో , తుపాను ప్రభావం ఉండగల ప్రాంతాలలో ముందస్తు ఏర్పాటుగా సిద్ధంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కేరళలోని త్రిసూరు, ఒడషాలోని ముండి లలో రిజర్వు బృందాలను ఎలాంటి అదనపు పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచారు.
అన్ని బృందాలు విశ్వసనీయమైన వైర్‌లెస్, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ, చెట్లు నరికే యంత్రాలు, స్థంభాలను తొలగించే సామగ్రి,తుపాను అనంతరం వ్యవస్థల పునరుద్ధరణకుఅవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితులలో ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు తగిన పిపిఇలు కలిగి ఉన్నాయి.
ఎన్‌డిఆర్ఎఫ్ జిల్లా, స్థానిక పాలనా యంత్రాంగాలతో కలసి సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నది. తుపాన్ల సందర్భంగా ప్రజలు చేయవలసిన,చేయకూడని పనులపై ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కోవిడ్ ప్రభావిత ప్రాంతాలు,కోవిడ్ అదుపునకు తీసుకోవలసిన చర్యల గురించి తెలియజేస్తున్నారు. తుపాను ప్రభావం ఉండగల ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యకలాపాలలో ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు స్థానిక పాలనాయంత్రాంగాలకు సహకరిస్తున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రజలలో తాము అండగా ఉన్నామన్న భద్రతా భావాన్ని కలిపిస్తున్నాయి.ప్రజలు ఎ లాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని తాము పరిస్థితి సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉంటామన్న భరోసా కల్పిస్తున్నాయి.
******
(Release ID: 1675539)
Visitor Counter : 179