వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నాణ్యత మరియు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని శ్రీ పియూష్ గోయల్ భారత పరిశ్రమకు పిలుపునిచ్చారు

Posted On: 24 NOV 2020 6:12PM by PIB Hyderabad

నాణ్యతతో పాటు ఉత్పాదకత మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ భారత పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఈ రోజు వివిధ పరిశ్రమల సంఘాల ఆఫీసు బేరర్లతో సంభాషిస్తూ.." వచ్చే నెలలో కొన్ని రోజులు ఈ  ఆంశాలకు కేటాయించాలని తద్వారా  అధిక నాణ్యత, సమర్థవంతమైన తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్‌గా భారత్‌కు గుర్తింపు దక్కుతుందని చెప్పారు. ఇది రంగాల వారీగా లేదా ప్రాంతాలవారీగా సంస్థల మధ్య అవగాహన పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రధాన సంస్థల రెండవ త్రైమాసిక ఫలితాల్లో లాభదాయకత పెరిగిందని  శ్రీ గోయల్ చెప్పారు. తద్వారా భారత పరిశ్రమ కొవిడ్ కాలంలో ఉత్పత్తిని మెరుగుపరచడం మరియు నాణ్యతపై దృష్టి పెట్టినట్టు అది సూచిస్తోందని చెప్పారు. ఉత్పాదకతను మిషన్-మోడ్‌లోకి తీసుకెళ్లడానికి పరిశ్రమల మద్దతును కోరిన శ్రీ గోయల్..సంక్షోభాన్ని అవకాశంగా మార్చడానికి నాణ్యత మరియు ఉత్పాదకత సహాయపడతాయని చెప్పారు.

కష్టకాలంలో భారత పరిశ్రమ విశ్వాసాన్ని చూపించిందని, ఇది మహమ్మారిపై పోరాడటానికి దేశానికి సహాయపడిందని శ్రీ గోయల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే దిశగా పలు సంకేతాలు వెలువడుతున్నాయని  అంతర్జాతీయ రంగంలో కూడా భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగిందని తద్వారా విశ్వసనీయ భాగస్వామిగా ఆవిర్భవించిందని అన్నారు. విజయవంతమైన బలమైన దేశంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ మేరకు విధానాల్లో మార్పులు జరుగుతున్నాయని తద్వారా ప్రస్తుత స్థానం నుండి మరింత ముందుకు భారత్ సాగుతోందని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య జాగ్రత్తలు కొనసాగించాలని ఈ దశలో సడలింపులు పలు సమస్యలను సృష్టిస్తాయని సదస్సుకు హాజరైన వారికి సూచించారు. పరిశ్రమ సంఘాల సూచనలను ప్రభుత్వం స్వీకరించిందని వివిధ విభాగాల వారీ పరిశీలన తర్వాత తగిన స్పందన వస్తుందని మంత్రి చెప్పారు.

కోవిడ్ -19 నేపథ్యంలో పరిశ్రమల సంఘాలతో మంత్రి జరిపిన సంప్రదింపుల పరంపరలో భాగంగా ఈ సమావేశం జరిగింది. గతంలో జరిగిన సదస్సుల్లో చాలా సూచనలు మరియు క్షేత్రస్థాయి నుండి అభిప్రాయాలు వచ్చాయి. ప్రభుత్వం పలు చర్యలను తీసుకునేందుకు విధానాలను ఖరారు చేసుకునేందుకు అవి సహాయపడ్డాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ సమస్యలను సకాలంలో పరిష్కరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1675501) Visitor Counter : 129