ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రూ.234.68 కోట్ల విలువైన ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆమోదం
- కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షత ఐఎంఏసీ సమావేశం
Posted On:
24 NOV 2020 5:29PM by PIB Hyderabad
'ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన' (పీఎంకేఎస్‌వై) యొక్క వ్యవసాయ-ప్రాసెసింగ్ క్లస్టర్ (ఏపీసీ) మౌలిక సదుపాయాల కల్పన పథకం కింద అందిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మార్గంలో ఐఎంఏసీ సమావేశం జరిగింది. రూ.60.87 కోట్లతో సహా.. మొత్తం రూ.
రూ.234.68 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో కూడిన ఏడు ప్రతిపాదనలకు ఐఎంఏసీ తన అమోదాన్ని తెలిపింది. ఈ ప్రాజెక్టులు మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,కర్ణాటక రాష్ర్టాలకు చెందినవిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల రూ.173.81 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు మరియు 7750 మందికి ఉపాధి లభిస్తుంది. వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి.. ప్రధాన మంత్రి కిసాన్ సంపాదన యోజన కింద 03.05.2017న వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ (ఏపీసీ) మౌలిక వసతుల సృష్టించేందుకు ఈ పథకం ఆమోదించబడింది. క్లస్టర్ విధానం ఆధారంగా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయడానికి వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్లస్టర్లు మిగులు ఉత్పత్తుల వ్యర్థాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉద్యాన / వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచుతాయి. దీని ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతుంది మరియు స్థానిక స్థాయిలో ఉపాధి లభిస్తుంది.
వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ పథకం కింద 24.11.2020న జరిగిన సమావేశంలో ఇంటర్ మినిస్టీరియల్ అప్రూవల్ కమిటీ (ఐఎంఏసీ) ఆమోదించిన ప్రాజెక్టుల జాబితా ఈ కింది విధంగా ఉంది:
క్రమ సంఖ్య
|
పీఈఏ పేరు
|
ప్రాజెక్టు ప్రాంతం
|
మొత్తం ప్రాజెక్టు వ్యయం (రూ. కోట్లలో)
|
మొత్తం ఆమోదించబడిన గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ (రూ. కోట్లలో)
|
1
|
మోస్సర్స్ మేఘా ఆగ్రో పార్క్
|
రి భోయ్, మేఘాలయ
|
21.65
|
8.8424
|
2
|
మెస్సర్స్ యష్ ఇండస్ట్రీస్
|
వల్సాద్, గుజరాత్
|
37.92
|
10.00
|
3
|
మెస్సర్స్ ప్రశున్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
ధార్, మధ్యప్రదేశ్
|
25.84
|
9.9743
|
4
|
మెస్సర్స్ హిరియూర్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్.
|
చిత్రదుర్గ, కర్ణాటక
|
22.60
|
4.27
|
5
|
మెస్సర్స్ దివ్యాన్షూ ఆగ్రో మరియు ఫుడ్ పార్క్
|
భండారా, మహారాష్ట్ర
|
24.58
|
8.9294
|
6
|
మెస్సర్స్ రేడియంట్ అగ్రో
|
థానే, మహారాష్ట్ర
|
37.40
|
8.8541
|
7
|
మెస్సర్స్ ప్రవీణ్ మసాలేవాలే
|
సతారా, మహారాష్ట్ర
|
64.69
|
10.00
|
|
|
మొత్తం
|
234.68
|
60.8702
|
***
(Release ID: 1675496)
Visitor Counter : 173