మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎఐసిటి నిర్వహిస్తున్న 46 ఆన్‌లైన్ ఫాకల్టీ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డిపి)లను ప్రారంభించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి
ఎఫ్‌డిపి కింద వెయ్యి కార్యక్రమాలలో లక్షమందికిపైగా శిక్షణ ఇవ్వడాన్ని లండన్‌లోని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చే , ప్రపంచ రికార్డుగా గుర్తింపు.
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి అటల్ అకాడమీ ఎక్కడం గర్వకారణం - శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
23 NOV 2020 5:27PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు ఎఐసిటిఇ ట్రైనింగ్, లెర్నింగ్ (అటల్ ) అకాడమీ ఫాకల్టీ డవలప్‌మెంట్ కు సంబంధించిన 46 ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)తో అనుబంధం ఉన్న ఉన్న త విద్యాసంస్థల టీచర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇది. ఎఫ్‌డిపి 22 రాష్ట్రాలలో చేపట్టడం జరుగుతుంది.
అటల్ అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం ఎంతో గర్వకారణమని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. లండన్ కు చెందిన ఈ సంస్థ ఎఫ్.డి.పి కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించిందని, 100కు పైగా ఎఫ్‌డిపి కార్యక్రమాల ద్వారా లక్షకు పైగా ఫాకల్టీ సభ్యులు ఆన్‌లైన్ ఎఫ్‌డిపి కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారన్నారు. ఇందులో ఐఐటిలు, ఎన్ఐటిలు ఐఐఐటిలకు చెందిన ఫాకల్టీ సభ్యులు ఉన్నారని అన్నారు. ఆన్‌లైన్ ఎఫ్‌డిపి కార్యక్రమానికి ఈ ఏడాది 10 కోట్ల రూపాయల ఖర్చు కాగలదని ఆయన అన్నారు.
అటల్ అకాడమీ ఎఫ్‌డిపి కార్యక్రమాలను ఆన్‌లైన్ పద్ధతిలో చేపడుతున్నదని, రిజిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేషన్ వరకు అన్నీ డిజిటల్ పద్ధతిలోనే ఉన్నాయన్నారు. 2020-21 సంవత్సరంలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లైఫ్ స్కిల్స్, డిజైన్, మీడియాలను చేర్చినట్టు తెలిపారు. ఆన్‌లైన్ ఎఫ్‌డిపి కార్యక్రమం నూతన విద్యా విధానం 2020 కి అనుగుణంగా చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.
1000 ఎఫ్‌డిపి ప్రోగ్రామ్‌లలో 499 ఎఫ్‌డిపి ప్రోగ్రామ్‌లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇందులో 70,000 మంది ఫాకల్టీ సభ్యులు శిక్షణపొందారు. 2019-20 సంవత్సరంలో 185 ప్రోగ్రామ్‌లు తొమ్మిది ముఖ్యమైన అంశాలలో ఐదు రోజులపాటు నిర్వహించారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ,3 డి ప్రింటింగ్, డిజైన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ , వర్చువల్ రియాలిటీ, వంటివి ఉన్నాయి. వీటివల్ల సుమారు 10 వేల మంది ప్రయోజనం పొందారు.
ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి సహస్రబుద్ధె ఈ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, స్మార్ట్ ఉపకరణాలైన కంప్యూటర్లు , స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్‌ల వాడకం పెరిగినందువల్ల డిజిటల్ అభ్యసన వంటివి విద్యార్ధి అభ్యసనను పెంచాయన్నారు. సిబిఎస్ి టీచర్లు ఫ్లిప్‌డ్ క్లాస్‌రూం, బ్లెండెడ్ లెర్నింగ్ విధానాలపై శిక్షణ పొందారన్నారు.ఫ్లిప్‌డ్ క్లాస్ రూం నమూనాలో విద్యార్ధులు ఆన్‌లైన్ లెక్చర్లను తమ వీలును బట్టి చూడవచ్చని అన్నారు. వాటి అసైన్ మెంట్‌లను చేయవచ్చని చెప్పారు. ఈ నమూనా విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలను పెంచడమే కాక, విద్యార్ధుల స్కోరును పెంచుతుందన్నారు. దీని కింద , టీచర్లు తమ లెక్చర్లను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవచ్చని తెలిపారు. విద్యార్ధులు వీటిని చూడవచ్చని , విద్యార్ధులు తరగతికి వచ్చే ముందు వీటిని చూసుకుని రావచ్చని ఇంటి వద్దే చదువుకోవచ్చని తరగతికి వచ్చే టపుడు వారు ఆ అంశానికి సంబంధించి తగిన పరిజ్ఞానంతో రావడానికి వీలుంటుందని అన్నారు. ఆ మరుసటి రోజు, టీచర్లు పోస్ట్ చేసిన లెక్చర్ కు సంబంధించి క్లాస్ రూమ్ కార్యకలాపాలను చేయించడానికి వీలు కలుగుతుందన్నారు. ఇందులో విద్యార్ధులు భాగస్వాములు కావచ్చన్నారు.
అటల్ అకాడమీ ప్రధాన లక్ష్యం దేశంలో నాణ్యమైన సాంకేతిక విద్య అందించడం, పరిశోధనను ప్రోత్సహించడం, వివిధ రంగాలలో శిక్షణను అందించడం. ఐఐటిలు, ఐఐఐటిలు, ఎన్ఐటిలు సియు, రిసెర్చ్ ల్యాబ్‌లు అటల్ ఎఫ్‌డిపిలను నిర్వహిస్తున్నాయని ఎఐసిటిఇ వైస్ ఛైర్మన్ ఎం.పి.పూనియా తెలిపారు.
ఎఐసిటిఇ నిర్వహిస్తున్న ఎఫ్‌డిపిలు ప్రస్తుత అవసరమని, దీనితో ఉన్నత విద్యాసంస్థలలోని అధ్యాపకులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులను ఎడ్యుకేట్ చేయడానికి, వారిని వివిధ నైపుణ్యాలలో నిష్ణాతులను చేయడానికి వీలు కలుగుతుందని ఎఐసిటిఇ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ వంటి సవాళ్లతో కూడిన పరిస్థితులలొ, ఈ కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిసోర్స్ పర్సన్స్ క్లాసులు తీసుకోగలుగుతున్నారని అన్నారు. ఎఫ్.డి.పి కార్యక్రమాలు ఆన్‌లైన్ స్వభావం కలిగినవి అయినందున ఈ అవకాశం లభించిందని అన్నారు.
అటల్ అకాడమీ నూతన విద్యా విధానం కింద నేషనల్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
అటల్ అకాడమీ డైరక్టర్ డాక్టర్ రవీంద్ర కుమార్ సోని మాట్లాడుతూ, కేవలం రెండు సంవత్సరాలలో అకాడమీ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎప్‌డిపిలను నిర్వహించగలుగుతున్నదని అ్నారు. ఈ కార్యక్రమాలు భారతీయ విద్యార్ధులు నూతన సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోవడానికి, దీనిని కెరీర్‌గా మార్చుకోవడానిఇక ఉపయోగపడతాయన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అడ్వాన్స్ శిక్షణకు కూడా ప్రణాళికలు రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు.
***
(Release ID: 1675351)
Visitor Counter : 213