సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
తమిళనాడులోని పుదుకొట్టైలో 1398మంది దివ్యాంగులకు సహాయక పరికరాల ఉచిత పంపిణీ ఎడిఐపి శిబిరాన్ని దృశ్య మాధ్యమం ద్వారా రేపు ప్రారంభించనున్న తావర్‌చంద్ గెహ్లాట్
నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2020 2:39PM by PIB Hyderabad
దివ్యాంగులకు అవసరమైన తోడ్పడే పరికరాల ఉచిత పంపిణీ కోసం తమిళనాడులో నిర్వహించిన ఎడిఐపి శిబిరాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ మంగళవారం దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. పుదుకొట్టైలో మొత్తం 1398 మంది దివ్యాంగులకు శ్రవణ, ఇతర సహాయ పరికరాలనుఈ సందర్భంగా అందించనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు తిరుచిరాపల్లి నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. సి. విజయభాస్కర్ పుదుకొట్టాయ్‌లోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. భారత ప్రభుత్వ పథకమైన ఎడిఐపి కింద పుదుకొట్టై జిల్లాలో గుర్తించిన దివ్యాంగులకు ఉచితంగా సహాయక పరికరాల పంపిణీ జిల్లా స్థాయి శిబిరం, బ్లాకు స్థాయి శిబిరాన్ని పుదుకొట్టైలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
పుదుకొట్టై జిల్లాకు చెందిన 1398మంది లబ్ధిదారులకు రూ.117 లక్షల విలువైన మొత్తం 2547 సహాయక పరికరాలను అందించనున్నారు. జిల్లాలోని 09 భిన్న బ్లాకులకు, బ్లాకుల వారీగా పంపిణీ జరుగనుంది.
ప్రారంభ శిబిరంలో పుదుకొట్టై బ్లాకుకు చెందిన 64మంది లబ్దిదారులకు రూ. 24.8 లక్షల విలువైన 131 సహాయక పరికరాలను అందిస్తున్నారు. ఇందులో 04 చేతితో నడిపై త్రిచక్రవాహనాలు, 11 చక్రాల కుర్చీలు, 14 సి.పి. కుర్చీలు, 12 క్రచ్‌లు, 04 వాకింగ్ స్టిక్స్, 09 రోలేటర్, 09 స్మార్్ట కేన్, 04 స్మార్్ట ఫోన్, 04 టాబ్లెట్లు, అంథులకు 03 డైసీ ప్లేయర్లు, 20 వినికిడి మెషీన్లు, 17 ఎంఎస్ ఐఇడి కిట్లు, 20 కృత్రిమ అవయవాలు, కాలిపర్లు ఉన్నాయి.
ఈ శిబిరాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు అనుబంధమైన వికలాంగ వ్యక్తుల సాధికారత విభాగం కింద పని చేస్తున్న కృత్రిమ అంగాల ఉత్పత్తి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్పూర్, పుదుకొట్టై జిల్లా పరిపాలనా శాఖతో కలిసి నిర్వహిస్తోంది. కోవిడ్ 19 సంక్షోభం సమయంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ శిబిరాన్ని ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.
దశలవారీగా 09 బ్లాకులలో పంపిణీ చేయనున్న మొత్తం సహాయక పరికరాలలో 76 చేతితో నడిపే త్రిచక్రవాహనాలు, 301 చక్రాల కుర్చీలు, 72 సి.పి. కుర్చీలు, 420 క్రచ్‌లు, 124 వాకింగ్ స్టిక్్స, 11 రోలాటర్లు, 52 స్మార్్ట కేన్లు, 15 ప్రామాణీక మడతపెట్టే కేన్లు, 24 స్మార్్ట ఫోన్లు, 06 టాబ్లెట్లు, అంథులకు 05 డైసీ ప్లేయర్లు, 01 బ్రెయిలీ కిట్, 01 బ్రెయిలీ స్లేట్, 502 వినికిడ పరికరాలు, 444 ఎంఎస్ ఐఇడి కిట్లు, కుష్టు రోగులకు రోజువారీ తోడ్పడే 93 కిట్లు, 229 కృత్రిమ అవయవాలు, కాలిపర్్స ఉన్నాయి.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్త చర్యలు, వ్యక్తిగత ఆరోగ్య భద్రత చర్యలను సహాయక పరికరాల పంపిణీ సమయంలో తీసుకోనున్నారు. ప్రతి వ్యక్తికి థర్మల్ స్ర్కీనింగ్, తప్పనిసరిగా మాస్కును ఉపయోగించడం, శానిటైజసర్లు, చేతికి గ్లోవ్స్ , పిపిఇ కిట్లను లబ్ధిదారులను సంప్రదించే సమయంలో అందుబాటులో ఉంచడం జరగనుంది. పంపిణీ కోసం శిబిర స్థలం, తరచుగా అంటుకునే ప్రాంతాన్ని కూడా నూతన ప్రామాణీకరణ కార్యకలాపాల ప్రక్రియ కింద శానిటైజేషన్ చేస్తున్నారు.
పరికరాలనుపరికరాలను విడుదల చేసేముందు, రవాణా వాహనాన్ని శానిటైజ్ చేయడం తెరిచిన/ మూసి ఉంచిన నిల్వ ఉంచే ప్రాంతాల శానిటైజేషన్ సహా బహుళ స్థాయి శానిటైజేషన్, సహాయ పరికరాల రీశానిటైజేషన్ ను పంపిణీకి ముందు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే లబ్ధిదారులు, వారికి సహాయకులుగా వచ్చిన వారికి సోషల్ డిస్టెన్సింగ్ ఉండేలా కుర్చీల ఏర్పాటు చేయడం, నిర్ధిష్ట సమయంలో ఒక బ్యాచీలో 40మంది లబ్ధిదారుల చొప్పున వచ్చేందుకు, వెళ్ళేందుకు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది.
స్థానిక ప్రజా ప్రతినిధులు, భారత ప్రభుత్వ దివ్యాంగుల సాధికారత శాఖకు చెందిన సీనియర్ అధికారులు, పుదుకొట్టై జిల్లా యంత్రాంగం, ఎఎల్ ఐఎంసిఒ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు
https://youtu.be/EjDWQrcEmPg అన్న లింక్‌ను క్లిక్ చేసి పాల్గొనవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 1675095)
సందర్శకుల సూచీ సంఖ్య : : 136