రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌త‌-థాయ్ కో-ఆర్డినేటెడ్ పెట్రోల్ (కార్ప‌ట్)

Posted On: 20 NOV 2020 1:33PM by PIB Hyderabad

భారత నావికా దళం, రాయల్ థాయ్ నేవీ మధ్య నిర్వ‌హించే 'భారత-థాయి లాండ్ కో-ఆర్డినేటెడ్ పెట్రోల్'(ఇండో-థాయ్ కార్ప‌ట్) కార్య‌క్ర‌మం ఈ నెల 18 నుండి 20 వరకు జ‌రిగింది. ఇది 30వ ఎడిష‌న్ కార్ప‌ట్ కార్య‌క్ర‌మం. ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) ఖార్ముక్, స్వదేశీయంగా నిర్మిత‌ క్షిపణి కొర్వెట్టి, హిజ్ మెజెస్టిస్‌ థాయ్‌లాండ్ షిప్ (హెచ్‌టీఎంఎస్) క్రబూరి, చావో ఫ్రేయా క్లాస్ ఫ్రిగేట్ ‌తో పాటు డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌తో కూడిన రెండు నావికా దళాలు ఈ కార్ప‌ట్‌లో పాల్గొంటున్నాయి. భారత ‌ప్ర‌భుత్వపు సాగ‌ర్ దృష్టికోణానికి
అనుగుణంగా (ఈ ప్రాంతంలోని వారి అంద‌రి భ‌ద్ర‌త మ‌రియు వృద్ధి) హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆయా దేశాలకు ఈఈజెడ్ నిఘా మానవతా సాయం, విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్‌) ఇతర సామర్థ్యాలతో కూడిన స‌హాయాన్ని  అందించే కార్య‌క్ర‌మాల్లో భారత నావికాదళం పాల్గొంటోంది. వారివారి అభ్యర్థనల మేర‌కు సామ‌ర్థ్య నిర్మాణం, సామర్ధ్య మెరుగుదల కార్యకలాపాల‌ను చేప‌డుతోంది.
భారతదేశం, థాయిలాండ్‌లు  ప్రత్యేకించి విస్తృతమైన కార్యకలాపాల‌లో పరస్పర చర్యలు, సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాల్నికలిగి ఉన్నాయి. ఇవి గ‌త కొన్ని సంవత్సరాలుగా బలప‌డుతూ వ‌స్తున్నాయి. సముద్ర సంబంధాలను బలోపేతం చేయడానికి, రెండు నావికా దళాలు 2005 నుండి సంవత్సరానికి రెండు సార్లు తమ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంట కార్ప‌ట్‌ను నిర్వహిస్తు వ‌స్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క ఈ ముఖ్యమైన భాగాన్ని వాణిజ్య షిప్పింగ్ మరియు అంతర్జాతీయ వాణిజ్యం కోసం సురక్షితంగా మరియు భద్రంగా ఉంచే లక్ష్యంతో దీనిని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. కార్ప‌ట్ నావికాదళాల మధ్య అవగాహనను పరస్పర సామర్థ్యాన్ని పెంచుతూ వ‌స్తోంది. చట్టవిరుద్ధమైన నివేదించని క్రమబద్ధీకరించని (ఐయూయూ) ఫిషింగ్, మాదక ద్రవ్యాల రవాణా, సముద్ర ఉగ్రవాదం, సాయుధ దోపిడీ, పైరసీ నిరోధించ‌డంతో పాటు ఇలాంటి కార్య‌క‌లాపాల‌ను అణచి వేయడానికి అవ‌స‌ర‌మైన‌ చర్యలను ఇది సులభతరం చేస్తుంది. అక్రమ రవాణా, అక్రమ వలసల నివారణ సముద్రంలో ఎస్ఏఆర్‌ కార్యకలాపాల నిర్వహణకు అవస‌‌ర‌మైన‌ సమాచార మార్పిడి ద్వారా ఇది కార్యాచరణ సినర్జీని మరింతగా పెంచుతుంది. 30వ ఇండో-థాయ్ కార్ప‌ట్ కార్య‌క్ర‌మంలో అంత‌ర్గ‌త నిర్వ‌హ‌ణ‌ను ఏకీకృతం చేయడానికి మరియు రాయల్ థాయ్ నేవీతో స్నేహాన్ని పెంచుకోవటానికి భారత నావికాదళం చేసే ప్రయత్నాలకు దోహదం చేస్తుంది.

                               

******


(Release ID: 1674578) Visitor Counter : 227