కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“ఛత్ పూజపై నా స్టాంప్”ను విడుదల చేసిన కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్

- “ఛాత్- సరళత మరియు శుభ్రతకు చిహ్నం” అనే ఇతివృత్తంతో ఒక ప్రత్యేక కవర్ విడుదల

- వివిధ ప్రసిద్ధ ఉత్సవాల చరిత్రను స్టాంపుల ద్వారా ఆవిష్క‌రించే అవకాశాన్ని అన్వేషించాలని తపాలా శాఖకు పిలుపునిచ్చిన మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్

Posted On: 19 NOV 2020 5:27PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్‌లు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు “ఛత్ పూజపై నా స్టాంప్” అనే ప్ర‌త్యేక త‌పాలా స్టాంప్‌ను విడుద‌ల చేశారు. నా స్టాంప్ అనేది త‌పాలా శాఖ వినూత్న భావన. ఏదైనా సాధారణ వ్యక్తి లేదా కార్పొరేట్ సంస్థ ప్ర‌త్యేక ఆర్డర్‌తో బుక్ చేసి వ్యక్తిగతీకరించిన ఛాయాచిత్రంతో తపాలా స్టాంప్‌ పొందవచ్చు. వ్య‌క్తిగ‌తీక‌రించిన‌
బ‌హుమ‌తుల విభాగంలో త‌పాలా శాఖ అందిస్తున్న బ‌హుళ ప్రజాదరణ పొందిన ప్రత్యేకమైన‌ ఉత్పత్తులలో మై స్టాంప్ ఒకటి. “ఛత్ పూజపై నా స్టాంప్” అనే ఈ ప్ర‌త్యేక స్టాంప్ దేశంలోని అన్ని ఫిలాటెలిక్ బ్యూరోక్స్‌ల‌తో పాటుగా అన్ని ప్రధాన త‌పాలా కార్యాల‌యాల‌లో ల‌భిస్తుంది. ఈ వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో భాగంగా..

 


‘ఛ‌త్- సరళత మరియు పరిశుభ్రతకు చిహ్నం’ అనే అంశంపై ప్రత్యేక ముఖ చిత్రంతో కూడిన ఒక ప్ర‌త్యేక క‌వ‌ర్‌ను కూడా విడుదల చేశారు. ప్ర‌త్యేక స్టాంప్


విడుద‌ల చేసిన అనంత‌రం కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఛ‌త్‌ పూజలో మాత్రమే ఉదయించే సూర్యుడిని మాత్రమే కాకుండా.. సూర్యా స్తమయాన్ని కూడా ఆరాధించుకొంటూ జ‌రుపుకొనే పండుగని అన్నారు. అంటే
ఉష మరియు ప్రత్యూషను కూడా పూజించే పండుగ రోజిద‌ని కేంద్ర మంత్రి వివ‌రించారు. సూర్య దేవుడు మ‌రియు ఛతిమాయ‌ ఆరాధన సంప్రదాయాలకు ప్రత్యేకమైనది, సరళత, స్వచ్ఛత మరియు క్రమశిక్షణ విలువలను ఇది తెలియ ప‌రుస్తుంద‌ని అన్నారు. కోవిడ్ మహమ్మారి విస్త‌రించి ఉన్న వేళ ముఖ్యంగా లబ్ధిదారులకు ఇంటి వద్ద డబ్బును పంపిణీ చేయడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వేళ పోస్టుల శాఖ చేసిన మంచి పనిని శ్రీ ప్రసాద్ అభినందించారు. వివిధ ప్రసిద్ధ ఉత్సవాలతో పాటు చరిత్రను స్టాంపుల ద్వారా ఆవిష్క‌రించే అవకాశాన్ని అన్వేషించాలని కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్
తపాలా శాఖకు పిలుపునిచ్చారు. బంకీపూర్ శాస‌న స‌భ్యుడు శ్రీ నితిన్ నబిన్,
దీఘా శాస‌న స‌భ్యుడు శ్రీ సంజీవ్ కుమార్ చౌరాసియాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీహార్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ శ్రీ అనిల్ కుమార్ మరియు బీహార్ పోస్టల్ సర్కిల్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్టర్ జనరల్ శ్రీ వినీత్ పాండే కృతజ్ఞతలు తెలిపారు.


 

*****



(Release ID: 1674120) Visitor Counter : 165