శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కీటకాల అరుపులే త్వరలో ఆయా జాతుల గుర్తింపు కార్డులు కావచ్చు
డాక్టర్ రంజన్ జైశ్వరా, ఇన్స్పైర్ ఫ్యాకల్టీ ఫెలో చేసిన పరిశోధన భారతదేశంలోని దాదాపు 140 జాతుల ఫీల్డ్ క్రికెట్లలో పరిణామ సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
Posted On:
18 NOV 2020 2:00PM by PIB Hyderabad
వివిధ రకాల కీటకాల జాతుల వైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి, పరిశోధించేందుకు అవి చేసే అరుపులే సహాయపడనున్నాయి. ఈ మేరకు శబ్ద తరంగాలకు సంబంధించిన లైబ్రరీని శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు.
జాతుల వైవిధ్యాన్ని గుర్తించడానికి మరియు పరిశోధనకు సంబంధించిన స్వరూప-ఆధారిత సాంప్రదాయ వర్గీకరణ చాలా అభివృద్ది చెందింది. అయితే ఒకేరకమైన రెండు జాతుల మధ్య వైవిధ్యాన్ని గుర్తించేందుకు విభిన్న స్వరూప లక్షణాలను వ్యక్తీకరించేందుకు అది సరిపోదు. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ జాతులు నిర్మాణపరంగా వేరు చేయలేని జాతుల సమూహనికి చెందినవి లేదా విభిన్న స్వరూప లక్షణాలను వ్యక్తీకరించే ఒకే జాతికి చెందినవి కూడా ఉంటాయి. అందువల్ల నిర్మాణ పరమైన లక్షణాల ఆధారంగా జాతుల వైవిధ్యాన్ని గుర్తించడం వల్ల తప్పుడు అధ్యయనాల నమోదుకు దారి తీస్తుంది.
ఈ సవాలును అధిగమించడానికి పంజాబ్ విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) ఇన్స్పైర్ ఫ్యాకల్టీ ఫెలో డాక్టర్ రంజనా జైశ్వరా, ఫీల్డ్ క్రికెట్స్ ఎకౌస్టిక్-సిగ్నల్ లైబ్రరీని స్థాపించడానికి కృషి చేస్తున్నారు. జాతుల వైవిధ్యం అంచనా మరియు పర్యవేక్షణకు ఇది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీ డిజిటల్‌గా ఉంటుంది. అందువల్ల మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా వివిధ రకాల కీటకాల జాతులను గుర్తించడంతో పాటు అధ్యయనం కోసం దీనిని ఉపయోగించవచ్చు. భారతదేశంలోని సరికొత్త జాతుల కీటకాల గుర్తించేందుకు వాటిని నమోదు చేసేందుకు ఈ లైబ్రరీను వాడవచ్చు.
డాక్టర్ జైశ్వరా పరిశోధన జాతుల మధ్య వైవిధ్యాన్ని వివరించడంలో సమగ్ర సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే అధునాతన సాధనాలను ఉపయోగించడం ద్వారా కీటకాల జాతుల మధ్య వైరుధ్యాలను కనిపెట్టడంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరిస్తుంది.
http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FRB7.jpg
జాతుల వైవిధ్యాన్ని అధ్యయనం చేయడంలో శబ్ద సంకేతాలు, డిఎన్‌ఏ మార్పులు మరియు ఫోనోటాక్టిక్ బిహేవియరల్ డేటాలు ఈ సాధనాలలో ఉంటాయి. ఆమె ఫీల్డ్ క్రికెట్లను మోడల్ జీవిగా ఉపయోగిస్తుంది. జర్నల్ ఆఫ్ జూలాజికల్ సిస్టమాటిక్స్ అండ్ ఎవల్యూషనరీ రీసెర్చ్‌లో ప్రచురించిన ఆమె పరిశోధనలో, జాతుల వైవిధ్యాలను గుర్తించడంలో జాతుల-నిర్దిష్ట బయోకౌస్టిక్స్ సిగ్నల్స్ అత్యంత సమర్థవంతమైన మరియు నమ్మదగిన సాధనమని ఆమె నిరూపించింది. అలాగే ఏదైనా నిర్ధిష్టమైన భౌగోళిక ప్రాంతంలో జాతుల వైవిధ్యం, వాటి మధ్య సారూప్యతలను అధ్యయనం చేయడానికి దీనితి సాధనంగా ఉపయోగించవచ్చు.
బయోఅకౌస్టిక్ సిగ్నల్ మరియు గణాంక విశ్లేషణల ప్రాథమిక నైపుణ్యంతో జాతుల వైవిధ్యాన్ని అతి సులభంగా కనిపెట్టవచ్చని డాక్టర్ జైశ్వరా డాక్యుమెంట్‌లో వెల్లడించారు. ఈ సమగ్ర విధాన ఆధారిత అధ్యయనాలు భారతదేశం, బ్రెజిల్, పెరూ మరియు దక్షిణాఫ్రికాల్లో అనేక కొత్త జాతుల క్రికెట్ల ఆవిష్కరణకు దారితీశాయి.
న్యూరోఎథాలజీ, బిహేవియరల్ ఎకాలజీ, ప్రయోగాత్మక జీవశాస్త్రం మరియు ధ్వని తరంగాలను క్షేత్రస్థాయిలో సాధారణంగా ఉపయోగించే జీవులలో ఫీల్డ్ క్రికెట్‌లు ఒకటి. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి అత్యంత వేగంగా రుద్దుకోవడం ద్వారా బిగ్గరగా శబ్దాలను ఉత్పత్తి చేయగలగడం వీటికి ఉన్న ప్రత్యేక సామర్థ్యం.
భారతదేశంలో గుర్తించబడ్డ సుమారు 140 జాతుల ఫీల్డ్ క్రికెట్లలో ఫైలోజెనెటిక్ సంబంధాన్ని నిర్మించటానికి మరియు పరిణామ సంబంధాలను అర్థం చేసుకోవడానికి డాక్టర్ జైశ్వరా కృషిచేస్తున్నారు. ఈ అధ్యయనం ప్రపంచ స్థాయిలో శాస్త్రీయ సమాజానికి పరిణామ క్రమానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్‌ను అందిస్తుంది.
http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031J7P.jpg
ప్రచురణ లింకులు: DOI: 10.1111 / jzs.12298
DOI: 10.11646/zootaxa.4545.3.1
మరిన్ని వివరాల కోసం డాక్టర్ రంజనా జైశ్వర (ranjana.jaiswara[at]gmail[dot]com, 8264098022) సంప్రదించవచ్చు.
***
(Release ID: 1673788)
Visitor Counter : 160