ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్ 2020 లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం- పాఠం
Posted On:
17 NOV 2020 5:45PM by PIB Hyderabad
యువర్ ఎక్సలెన్సీ , అధ్యక్షుడు పుతిన్,
యువర్ ఎక్సలెన్సీ, అధ్యక్షుడు షి,
యువర్ ఎక్సలెన్సీ, అధ్యక్షుడు రమాఫోసా,
యువర్ ఎక్సలెన్సీ, అధ్యక్షుడు బోల్సోనారో,
మొదట, బ్రిక్స్ విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ ను అభినందిస్తున్నాను. మీ మార్గదర్శకత్వం మరియు చొరవ కారణంగా, ప్రపంచ మహమ్మారి కాలంలో కూడా బ్రిక్స్ దాని వేగాన్ని కొనసాగించగలిగింది. నేను మాట్లాడే ముందు, అధ్యక్షుడు రమాఫోసాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎక్సలెన్సీస్ ,
ఈ సంవత్సరం సదస్సు యొక్క ఇతివృత్తం " గ్లోబల్ స్టెబిలిటీ, మ్యూచువల్ సెక్యూరిటీ అండ్ పార్టనర్‌షిప్ ఫర్ ఇన్నోవేటివ్ గ్రోత్ " , అయితే ఇందులో దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంది. ప్రపంచంలో గణనీయమైన భౌగోళిక-వ్యూహాత్మక మార్పులు జరుగుతున్నాయి, ఇది స్థిరత్వం, భద్రత మరియు వృద్ధిపై ప్రభావం చూపుతుంది మరియు ఈ మూడు రంగాలలో బ్రిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఎక్సలెన్సీస్ ,
ఈ సంవత్సరం, రెండవ ప్రపంచ యుద్ధం 75 వ వార్షికోత్సవం సందర్భంగా, మరణించిన సైనికులకు మేము నివాళి అర్పిస్తున్నాము. ఐరోపా , ఆఫ్రికా మరియు ఆగ్నేయాసియా వంటి అనేక ప్రదేశాలలో భారతదేశం నుండి 2.5 మిలియన్లకు పైగా సైనికులు యుద్ధంలో చురుకుగా ఉన్నారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించిన 75 వ వార్షికోత్సవం..
ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యుడిగా, భారతదేశం బహుపాక్షికతకు బలమైన మద్దతుదారుగా ఉంది. భారతీయ సంస్కృతిలో కూడా, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఐక్యరాజ్యసమితి వంటి సంస్థకు మద్దతు ఇవ్వడం సహజం. ఐక్యరాజ్యసమితి విలువలకు మా నిబద్ధత స్థిరంగా ఉంది. శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో భారత్ అత్యధిక దళాలను కోల్పోయింది, కాని నేడు బహుపాక్షిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది.
గ్లోబల్ గవర్నెన్స్ సంస్థల విశ్వసనీయత మరియు ప్రభావం రెండూ ప్రశ్నించబడుతున్నాయి. కాలక్రమేణా ఇవి సరిగ్గా మారకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇవి ఇప్పటికీ 75 ఏళ్ల పురాతన ప్రపంచ మనస్తత్వం మరియు వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయి.
ఐరాస భద్రతా మండలి సంస్కరణ అనివార్యమని భారత్ అభిప్రాయపడింది. ఈ విషయంలో మా బ్రిక్స్ భాగస్వాముల మద్దతును మేము ఆశిస్తున్నాము. ఐక్యరాజ్యసమితితో పాటు అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత వాస్తవికత ప్రకారం పనిచేయడం లేదు. WTO, IMF, WHO వంటి సంస్థలను కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది.
ఎక్సలెన్సీస్ ,
ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదులకు మద్దతు మరియు సహాయం అందించే దేశాలను కూడా నిందించేవిధంగా మనం చూడాలి మరియు సమస్యను వ్యవస్థీకృత పద్ధతిలో పరిష్కరించేలా చూసుకోవాలి. రష్యా అధ్యక్ష పదవిలో బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వ్యూహం ఖరారు చేసినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది ఒక ముఖ్యమైన విజయం మరియు భారత దేశం వచ్చే సంవత్సరం బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తుందని, ఈ కృషిని ముందుకు తీసుకెళ్తుంది.
ఎక్సలెన్సీస్,
కోవిడ్ తరువాత ప్రపంచ పరిస్థితిని నయం చేయడంలో బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల పాత్ర కీలకం కానుంది. ప్రపంచ జనాభాలో 42% కంటే ఎక్కువ మంది మన మధ్య నివసిస్తున్నారు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన ఇంజిన్లలో మన దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు గొప్ప అవకాశం ఉంది.
మన స్వంత సంస్థలు మరియు వ్యవస్థలు - బ్రిక్స్ ఇంటర్-బ్యాంక్ కోఆపరేషన్ మెకానిజం, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ మరియు కస్టమ్స్ కోఆపరేషన్ వంటివి కూడా ప్రపంచ పునరుద్ధరణలో మన సహకారాన్ని సమర్థవంతంగా అందించగలవు.
భారతదేశంలో, 'స్వావలంబన భారతదేశం' ప్రచారం కింద సమగ్ర సంస్కరణ ప్రక్రియను ప్రారంభించాము. COVID అనంతర ఆర్థిక వ్యవస్థకు ఒక స్వావలంబన మరియు స్థితిస్థాపక భారతదేశం ఒక ఫోర్స్ గుణకం కావచ్చు అనే ఇతివృత్తం ఆధారంగా ఈ ప్రచారం జరుగుతుంది. గ్లోబల్ వాల్యూ చైన్‌లు బలమైన సహకారాన్ని అందించగలవు.ఇవి COVID సమయంలో కూడా చూశాము, భారతీయ ఫార్మా పరిశ్రమ సామర్థ్యం కారణంగా 150 కి పైగా దేశాలకు అవసరమైన మందులను పంపిణీ చేయగలిగాము.
నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మా వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు డెలివరీ సామర్థ్యం కూడా మానవత్వం యొక్క ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. కోవిడ్ -19 యొక్క టీకా, చికిత్స మరియు దర్యాప్తుకు సంబంధించిన మేధో సంపత్తి ఒప్పందాన్ని సడలించాలని భారతదేశం మరియు దక్షిణాఫ్రికా ప్రతిపాదించాయి. ఇతర బ్రిక్స్ దేశాలు కూడా దీనికి మద్దతు ఇస్తాయని మేము ఆశిస్తున్నాము.
బ్రిక్స్ ఛైర్మన్ పదవిలో, డిజిటల్ హెల్త్ మరియు సాంప్రదాయ వైద్యంలో బ్రిక్స్ సహకారాన్ని పెంచడానికి భారతదేశం కృషి చేస్తుంది.ఈ కష్ట సంవత్సరంలో, రష్యా అధ్యక్షతన, పదవి ప్రజలతో ప్రజల సంబంధాలను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు యువ శాస్త్రవేత్తలు మరియు యువ దౌత్యవేత్తల సమావేశాలు వంటివి. దీనికి అధ్యక్షుడు పుతిన్‌ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఎక్సలెన్సీస్ ,
2021 సంవత్సరం బ్రిక్స్ 15 వ వార్షికోత్సవం. మా షెర్పాస్ సంవత్సరాలుగా మా మధ్య తీసుకున్న వివిధ రకాల నిర్ణయాలను అంచనా వేయడానికి ఒక నివేదిక చేయవచ్చు. 2021 సంవత్సరంలో మా అధ్యక్ష పదవిలో, మూడు బ్రిక్స్ స్తంభాల మధ్య అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాము. బ్రిక్స్ దేశాలలో ఐక్యతను పెంపొందించడానికి మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక బలమైన సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి చేయడానికి మేం కృషి చేస్తాం. అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రయత్నాలన్నీ మరోసారి ప్రశంసిస్తూ నేను ముగిస్తాను.
ధన్యవాదాలు !
****
(Release ID: 1673670)
Visitor Counter : 201
Read this release in:
Hindi
,
Kannada
,
Tamil
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam