పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఒఎఎల్‌పి 5 బిడ్‌లో ఇ&పి బ్లాకుల ఒప్పందాలపై సంతకాల ఘట్ట నిర్వహణ
మార్కెట్ అనుకూల ఒఎఎల్‌పి ఇంధన రంగంలో స్వావంలంబనను ప్రోత్సహిస్తోంది - మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
17 NOV 2020 2:52PM by PIB Hyderabad
ప‌్రభుత్వం అమలు చేస్తున్న ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఒఎఎల్‌పి) మార్కెట్‌కు సానుకూల విధానమని, ఇది ఇంధన రంగంలో స్వావలంబనను ప్రోత్సహిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల, స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం పేర్కొన్నారు. ఒఎఎల్‌పి 5వ బిడ్ కింద అందిస్తున్న 11 చమురు, వాయువు బ్లాకుల కాంట్రాక్టులపై సంతకాలు చేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు.
హెల్ప్ విధాన అమలు, అనంతరం ఒఎఎల్‌పి బిడ్ రౌండ్లు భారతదేశంలో చముర బ్లాకుల అన్వేషణ పెరగడానికి దారి తీశాయని ప్రధాన చెప్పారు. గత పాలనాకాలంలో దాదాపు 80,000 చదరపు కి.మీ.లుగా ఉన్న అన్వేషిత బ్లాకులు ఇప్పుడు ఒఎఎల్‌పి 5వ రౌండ్ కింద బ్లాకులను ఇచ్చాక \2,37,000 చదరపు కి.మీ.లకు పెరిగిందని ఆయన వివరించారు.
ఇది పరివర్తనాత్మక విధానమని పేర్కొంటూ, ఒఎఎల్‌పి రెడ్ టేపిజంను తొలగించి, అన్వేషణ, ఉత్పత్తి రంగాలలో అత్యంత పెంచిందని మంత్రి అన్నారు. సాధారణ వ్యాపార ధోరణి నుంచి దూరంగా జరిగి, అత్యంత వేగం, వృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపిచ్చారు. అలాగే బిడ్లను గెలుచుకున్న వారు ఈ ప్రాంతాలలో చమురు, సహజవాయువు ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు నూతన వ్యాపార నమూనాలను, నూతన సాంకేతికతను తీసుకురావాలని కోరారు.
సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడుతూ, మరింత డిజిటైజేషన్, డాటా మ్యాపింగ్ పరికరాలు ఇ&పి క్షేత్రాన్ని ప్రాథమికంగా మార్చేందుకు తోడ్పడ్డాయని చెబుతూ, మరింత ఎక్కువగా సాంకేతికతను,అత్యాధునిక నిర్వహణ వ్యవస్థలను జొప్పించాలని మంత్రి ప్రధాన్ సూచించారు.
ఒఎల్ెపి బిడ్లను గెలుచుకున్న విజేతలకు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత‌్వాల నుంచి తగిన ఆమోదాల సౌలభ్యతను కల్పించడ ద్వారా వారి కార్యకలాపాలను నిర్వహించడానికి పూర్తి మద్దతు ఇస్తామని మంత్రి ప్రధాన్ ప్రకటించారు. ఈ ప్రాంతాలను విజేతలు మరింత అభివృద్ధి చేసి, తద్వారా అంతర్జాతీయ కంపెనీలను అన్వేషణ కార్యకలాపాలలోకి తీసుకువచ్చి, వార్యపారాన్ని వృత్తిపరంగా నిర్వహించాలని చెప్పారు. బిడ్డర్లు అందరూ వాస్తవాలు తెలుసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకునేందుకు సహేతుకమైన సమాచారం అందుబాటులోకి తీసుకురావడం కోసం డాటా సేకరణకు, డాటా నిర్వహణకు స్వతంత్ర సంస్థను స్థాపించాలన్నారు.
మొత్తం 19,789.04 చదరపు కిమీ విస్తీర్ణ కలిగిన 8 అవక్షేప బేసిన్లలోని 11 బ్లాకులను ఒఎల్ ఎపి 5వ బిడ్ రౌండ్లో రూ. 465 కోట్లను తక్షణ అన్వేషణ పని కోసం ఇవ్వడం జరిగింది. ఒఎన్‌జిసికి 7 బ్లాకులను ఇవ్వగా, 4 బ్లాకులను ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) దక్కించుకుంది.
***
(Release ID: 1673537)
Visitor Counter : 144