ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్ ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన శ్రీ నీతీశ్ కుమార్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2020 5:49PM by PIB Hyderabad
బిహార్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ నీతీశ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘బిహార్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన తరుణం లో శ్రీ నీతీశ్ కుమార్ గారికి అభినందనలు. బిహార్ ప్రభుత్వం లో మంత్రులుగా పదవీప్రమాణం చేసిన వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బిహార్ ప్రగతి కోసం ఎన్‌డిఎ కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుంది. బిహార్ సంక్షేమం కోసం కేంద్రం వైపు నుంచి సాధ్యమైన అన్ని విధాలుగా మద్ధతు ఉంటుందంటూ హామీ ని ఇస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1673218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 182
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam