ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2020 10:43AM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్త విని అమిత దుఃఖానికి లోనయ్యాను. ప్రభుత్వం రక్షణ, సహాయక కార్యకలాపాల్లో నిమగ్నమైంది. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ రోడ్డు ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1673108)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam