యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

క్రీడల ప్రోత్సాహానికి మంత్రిత్వ శాఖ వినూత్న నిర్ణయం 500 ప్రైవేట్ అకాడమీలకు నిధుల కేటాయింపు

Posted On: 14 NOV 2020 3:30PM by PIB Hyderabad

దేశంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రైవేట్ శిక్షణా కేంద్రాల ( అకాడమీలు)కు నిధులను కేటాయించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఖేలో ఇండియా పథకం కింద ఈ పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలపాటు తొలిసారిగా క్రీడామంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.

ఈ పథకం కింద ఎంపిక చేసిన అకాడమీలకు క్రీడామంత్రిత్వ శాఖ ఆర్ధిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. దీనికోసం క్రీడలలో శిక్షణ ఇస్తున్న అకాడమీలను వివిధ తరగతులుగా విభజించడం జరుగుతుంది. అకాడమీలలో శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ, అకాడమీలో శిక్షణ ఇస్తున్నవారి స్థాయి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, శాస్త్రీయ సౌకర్యాలు లాంటి అంశాల ప్రాతిపదికగా అకాడమీలను ఎంపిక చేస్తారు. 2028లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల అంశాలను దృష్టిలో ఉంచుకుని తొలి దశలో 14 క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సహకారం కోసం ఎంపిక చేస్తారు.

తన మంత్రిత్వ శాఖ అమలుచేయనున్న పథకం గురించి మాట్లాడిన కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజీజూ ' దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని తీర్చిదిద్దడానికి ఇటువంటి శిక్షణా సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉంటుంది. క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణను అనేక చిన్న చిన్న అకాడమీలు అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఇటువంటి సంస్థలను గుర్తించి వాటిలో సౌకర్యాలు, శాస్త్రీయ శిక్షణ ఇతర సౌకర్యాలను మెరుగుపరచడానికి సహకారం అందిచడం జరుగుతుంది. దీనివల్ల క్రీడాకారులు మరింత ఉన్నత శిక్షణను పొందడానికి అవకాశం కలుగుతుంది' అని వివరించారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ హర్షం వ్యక్తం చేశారు. గన్ ఫర్ గ్లోరీ అనే శిక్షణా సంస్థను ప్రైవేటుగా నిర్వహిస్తున్న గగన్ ' ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ శిక్షణా సంస్తలకు ఎంతగానో సహకరిస్తుంది. ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి క్రీకాకారులను తీర్చి దిద్దడానికి ఈ చర్య దోహద పడుతుంది.'అని అన్నారు.

ఈ పథకం కింద సాయ్, ఎన్ఎస్ఎఫ్ లు కలసి పనిచేస్తాయి. రెండు సంస్థలు అకాడమీలను ఎంపికచేయడం, వాటిని తరగతులుగా విభజించడం చేస్తాయి. ఈ క్రీడా రంగానికి ఏ మేరకు ప్రోత్సాహక నిధులను కేటాయించాలన్న అంశాన్ని ఒలింపిక్స్ లో ఆయా అంశాలలో పతకాలను సాధించడానికి గల అవకాశాలు, ఎన్ఎస్ఎఫ్ ల సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడుతుంది. అన్ని అకాడమీలలో శిక్షణా స్థాయిని మెరుగుపరచడానికి శాస్త్రీయ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సాయ్ కి కృతజ్ఞతలు తెలిపిన గోపీచంద్ ' ఇది దేశంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది. అన్ని రంగాల క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తూ క్రీడలకు అనువైన వాతావరణాన్ని ఈ నిర్ణయం కల్పిస్తుంది.' అని అన్నారు.

***

 


(Release ID: 1672932)