రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దివ్యాoగులకు అండగా కేంద్రం

Posted On: 13 NOV 2020 5:22PM by PIB Hyderabad

దివ్యాoగులకు మరింత సహకారాన్ని అందించడడానికి చర్యలను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాధారణ వాహనాలకు వర్తింప చేస్తున్న మినహాయింపులు, సౌకర్యాలను దివ్యాoగులకు చెందిన వాహనాలకు కూడా వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను శాఖ ఆదేశాలను జారీ చేసింది.

సీఎంవీఆర్ 1989లోని ఫారం 20లో మార్పులు చేస్తూ 2020 అక్టోబర్ 22 వ తేదీన మంత్రిత్వ శాఖ జిఎస్ఆర్ 661 ( ఈ )ను జారీ చేసింది. మోటారు వాహనాలను కొనుగోలు / యాజమాన్యం /నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ పథకాల కింద జీఎస్టీ తదితర ప్రయోజనాలతో యాజమాన్య వివరాలను పొందుపరచడానికి వీలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనివల్ల ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ ప్రయోజనాలను పొందడానికి దివ్యాoగులకు అవకాశం కలుగుతుంది.

***


(Release ID: 1672799) Visitor Counter : 107