రాష్ట్రపతి సచివాలయం
విధాన నిర్ణేతలకు జాతీయ ఆసక్తులు, అంతర్జాతీయ లక్ష్యాలు మార్గనిర్దేశం చేయాలి, ఆ రెండూ అనుకూల మరియు బహుముఖంగా ఉండాలిః రాష్ట్రపతి కోవింద్
- 60వ ఎన్‌డీసీ కోర్స్ వీడుకోలు వేడుకలో వీడియో సందేశం ద్వారా పాల్గొని ప్రసంగించిన రాష్ట్రపతి
Posted On:
13 NOV 2020 4:11PM by PIB Hyderabad
నేడు ప్రపంచ స్థితి ప్రతి దేశం ముందు పలు సవాళ్లను నిలుపుతోందని.. ఈ నేపథ్యంలో విధాన నిర్ణేతలు.. జాతీయ ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ లక్ష్యాలను మార్గనిర్దేశనంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈరెండూ అనుకూలమైనవి మరియు బహుముఖంగా ఉండాలి అని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ రోజు జరిగిన (నవంబర్13, 2020) ఎన్‌డీసీ 60వ కోర్సు వీడుకోలు సమావేశంలో ఆయన వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. కొన్ని దేశాలు అనుసరిస్తున్న విస్తరణ విధానం ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక, పరిణతి చెందిన ప్రతిస్పందనను కోరుతుందని రాష్ట్రపతి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీసీ ఇలాంటి అనేక సవాళ్లతో వ్యవహరిస్తుంది, భవిష్యత్తు కోసం బహుళ-కోణాలలో స్ట్రాటజిక్‌గా మరియు భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి దాని కోర్సు పాల్గొనేవారికి తగిన సాధనాలను అందిస్తుందని అన్నారు. జాతీయ సాయుధ దళాలు, పౌర సేవలకు చెందిన సీనియర్ అధికారులకు మాత్రమే కాకుండా, స్నేహపూర్వక విదేశీ దేశాల ఉన్నతాధికారులకు కూడా ఎన్‌డీసీ తగిన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించిందని రాష్ట్రపతి అన్నారు. ఇది ఆయా దేశాల వారు జాతీయ లక్ష్యాలకు సంబంధించిన విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడేలాల దోహదం చేశాయని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ఎన్‌డీసీ కోర్స్‌లో పాల్గొనే వారికి ఈ కోర్సులో భాగంగా అందించే విస్తృత పాఠ్యాంశాలు.. మేటి సురక్షితమైన ప్రపంచం కోసం ఆశించే శిక్షణను, జ్ఞానాన్ని అందించడానికి స్పష్టంగా రూపొందించబడ్డాయన్నారు. కానీ మానవాళిపై అత్యంత తీవ్రమైన శాపమైన ఉగ్రవాదాన్ని మనం ప్రక్షాళన చేయగలిగితేనే సురక్షితమైన ప్రపంచం గురించి ఆలోచించవచ్చు అని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలు దాని ప్రతాపాన్ని ఎదుర్కొంటున్నందున ఇది అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన సమస్యగా మారింది. యూరోపియన్ దేశాలలో ఇటీవల జరిగిన పలు ఉగ్రవాదపు సంఘటనల నష్టం వర్ణణాతీతం. అంతర్జాతీయ సమాజం యొక్క సామూహిక ప్రయత్నాల ద్వారా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అభివ్యక్తిలోనూ ముద్ర వేయాల్సిన అవసరాన్ని మనం అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. తాజా ఘటనలు మనకు దీనినే తెలియపరుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్‌డీసీ సంస్థలో జరిగిన ‘ది ప్రెసిడెంట్స్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ’ విభాగం గురించి ప్రస్తావిస్తూ, గొప్ప సంస్థ యొక్క డైమండ్ జూబ్లీని గుర్తుచేసుకోవడం దిశగా ఇదో సంజ్ఞ అని రాష్ట్రపతి అన్నారు. వ్యూహాత్మక అభ్యాస సంస్థ యొక్క అత్యున్నత సంస్థలో చైర్ మేధో మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పూర్తి ప్రసంగం వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:
***
(Release ID: 1672797)
Visitor Counter : 154