ఆర్థిక మంత్రిత్వ శాఖ

రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల‌కు, గృహ కొనుగోలుదారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను ఊర‌ట‌

Posted On: 13 NOV 2020 4:17PM by PIB Hyderabad

 కేంద్ర ఆర్థిక మంత్రి న‌వంబ‌ర్ 12, 2020న ప్ర‌క‌టించిన‌ ఆత్మ నిర్భ‌ర్ ప్యాకేజీ 3.0లో భాగంగా గృహ కొనుగోలుదారుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను నుంచి ఊర‌ట క‌లిగించే  కొన్ని చ‌ర్య‌ల‌ను అమ‌లు చేయ‌నున్నారు.
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని 43 సిఎ సెక్ష‌న్‌ను 2018 వ‌ర‌కు స్టాంప్ డ్యూటీ విలువ‌ను (స‌ర్కిల్ రేటు) రియ‌ల్ ఎస్టేట్ జాబితా ప్ర‌క‌టిత అంచ‌నాను మించితే దాని బ‌దిలీని అమ్మ‌క‌పు ప‌రిగ‌ణ‌గా భావించేవారు. ఫ‌లితంగా, స్టాంప్ డ్యూటీ విలువ‌ను కొనుగోలు అంచ‌నాగా సెక్ష‌న్ 56(2) (ఎక్్స‌) కింద కొనుగోలుదారు కేసుగా భావించేవారు.
రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధిదారులు, కొనుగోలుదారుల‌కు కొంత ఊర‌ట‌ను క‌ల్పించేందుకు, విత్త చ‌ట్టం, 2018.కింద 5% ఒక ర‌క్ష‌ణ క‌ల్పించారు. అదుకు అనుగుణంగా, కొనుగోలు/ అమ్మ‌కం అచ‌నా, స‌ర్కిల్ రేటు 5% మించిన నేప‌థ్యంలో ఏర్ప‌డిన వ్య‌త్యాసం ఈ అంశాల‌ను లేవ‌నెత్త‌డం జ‌రిగింది. ఈ విష‌యంలో మ‌రింత ఊర‌ట‌ను క‌ల్పించేందుకు విత్త చ‌ట్టం, 2020 ఈ ర‌క్ష‌ణ‌ను 5% నుంచి 10%కి పెంచింది. దీనితో ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధి దారులు, కొనుగోలు దారులు స‌ర్కిల్ రేటు కొనుగోలు అంచ‌నాగా ఉండేందుకు కొనుగోలు/ అమ్మ‌కం మ‌ధ్య వ్య‌త్యాసం ఒప్పందపు విలువ‌కు, స‌ర్కిల్ రేటుకు మ‌ధ్య తేడా 10శాతం మించి ఉన్న‌ప్పుడు మాత్ర‌మే భావిస్తున్నారు.
రియ‌ల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను ప్రోత్స‌హించి, రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధిదారులు అమ్మ‌ని జాబితాను స‌ర్కిల్ రేటుక‌న్నా త‌గు మాత్రం త‌గ్గించి, గృహ కొనుగోలుదారుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా చూసేందుకు ఈ 10% నుంచి 20%కిర‌క్ష‌ణ‌ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 43 సిఎ కింద‌  న‌వంబ‌ర్ 12, 2020 నుంచి జూన్ 30, 2021వ‌ర‌కు 10% నుంచి 20%కి పెంచేందుకు నిర్ణ‌యించారు. అయితే, ఇది నివాస గృహాల అమ్మ‌క‌పు విలువ రూ.2 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.ఈ నిర్దేశిత కాల‌లో చ‌ట్టంలోని సెక్ష‌న్ ర‌56 (2) (ఎక్్స‌) కింద ఆవాసాల‌ను కొనుగోలు చేసే కొనుగోలుదారుల‌కు 10% నుంచి 20%కి పెంచిన ఈ ర‌క్ష‌ణ ఊర‌ట‌ను క‌ల్పిస్తుంది. క‌నుక‌, ఈ లావాదేవీల‌కు స‌ర్కిల్ రేటును అమ్మ‌క‌పు/  కొనుగోలు అంచ‌నాగా ప‌రిగ‌ణించేందుకు స‌ర్కిల్ రేటు క‌న్నా ఒప్పందం విలువ 20% ఎక్కువ‌గా ఉండాలి.
ఈ మేర‌కు నిర్ణీత స‌మ‌యంలో  శాస‌న స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించ‌నున్నారు.

***


 


(Release ID: 1672782) Visitor Counter : 225