విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆర్థిక సంవ‌త్స‌రం 21 రెండ‌వ త్రైమాసికానికి రూ. 3,117 కోట్ల ప‌న్ను

అనంత‌ర లాభాల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌ర్ గ్రిడ్‌
మొత్తం ఆదాయం 8% పెరిగి రూ. 9,890 కోట్లుగా న‌మోదు

Posted On: 12 NOV 2020 12:52PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని మ‌హార‌త్న కంపెనీ అయిన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ప‌వ‌ర్ గ్రిడ్‌), దేశ సెంట్ర‌ల్ ట్రాన్స్‌మిష‌న్ యుటిలిటీ (సిటియు) ప‌న్నుల అనంత‌ర లాభాలు (పిఎటి) రూ. 3,094 కోట్ల రూపాయ‌ల‌ను, ఏకీకృత ప్రాతిప‌దిక‌న మొత్తం రూ. 9,381 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్ధిక సంవ‌త్స‌రం 21 రెండ‌వ త్రైమాసికానికి ఖాతాలో చూపింది. స్వ‌తంత్ర ప్రాతిప‌దిక‌న ఆర్థిక సంవ‌త్స‌రం 21లో రెండ‌వ త్రైమాసికానికి గాను  ప‌న్నుల అనంత‌ర లాభాలు (పిఎటి) రూ. 3,117 కోట్ల రూపాయ‌ల‌ను, ఏకీకృత ప్రాతిప‌దిక‌న మొత్తం రూ. 9,890 కోట్ల రూపాయ‌ల‌ను చూపి, ఆర్థిక సంవ‌త్స‌రం 20లో ఇదే కాలానిక‌న్నా 23% , 8% పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. 
ఆరు నెల‌ల కాలానికి - ఆర్థిక సంవ‌త్స‌రం 21 మొద‌టి ఆరు నెలల్లో  ప‌న్నుల అనంత‌ర లాభాలు (పిఎటి)  రూ.5,142 కోట్లు,  ఏకీకృత ప్రాతిప‌దిక‌న మొత్తం 19,648 కోట్ల రూపాయ‌లు. ఇది గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఇదే కాలంతో పోలిస్తే 1% మ‌రియు 6% ఎక్కువ‌. స్వ‌తంత్ర ప్రాతిప‌దిక‌న పిఎటి, మొత్తం ఆదాయం రూ. 5,097 కోట్లు, రూ. 19511 కోట్లు, అంటే క్ర‌మంగా 3% మ‌రియు 6% ఎదుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. 
ఆర్ధిక సంవ‌త్స‌రం 21, రెండ‌వ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ప్రాతిప‌దిక‌న మూల‌ధ‌న వ్య‌యం సుమారు రూ. 3,100 కో్ట్ల‌ను, రూ. 10,693 కోట్లు విలువ క‌లిగిన మూల‌ధ‌న ఆస్తుల‌ను (ఎఫ్ ఇ ఆర్ వి మిన‌హా) క‌లిగి ఉంది.  
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను, అనేక స‌వాళ్ళ‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఈ త్రైమాసికంలో ప‌వ‌ర్ గ్రిడ్ ప్ర‌తిష్ఠాత్మ‌క రాయ‌గ‌ఢ్‌- పుగ‌లూర్ హెచ్‌విడిసి వ్య‌వ‌స్థ‌కు చెందిన బైపోల్ -1 లోని పోల్‌-1ను క‌మిష‌న్ చేసింది. దానితో పాటుగా ఐదు రాష్ర్టాల ద్వారా ప్ర‌యాణించే 1765 కిమీల పొడ‌వైన + 800 కెవి రాయ‌గ‌ఢ్‌-పుగ‌లూర్ హెచ్‌విడిసి ట్రాన్స్‌మిష‌న్ లైన్ ను, 400 కెవి డి/స‌ఇ పుగ‌లూర్ - అరాసుర్‌, 400 కెవి డి/స‌ఇ పుగ‌లూర్ - పుగ‌లూర్ ట్రాన్స్‌మిష‌న్ లైన్ల‌ను వేసింది. ప్రారంభించిన ఈ వ్య‌వ‌స్థ‌లు ప‌శ్చిమ ప్రాంతం నుంచి ద‌క్షిణ ప్రాంతానికి 1500 మెగావాట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాను స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా  ప్రామాణిక‌మైన‌, నాణ్య‌త క‌లిగిన విద్యుత్ స‌ర‌ఫ‌రాను సాధ్యం చేస్తుంది. 
ఈ త్రైమాసికంలో ఆరంభించిన భారీ ఆస్తులు - 400 కెవి డి/  సి ఎన్ ఎన్ టిపిఎస్ -అరియ‌లూర్ టిఎల్‌, 400 కెవి కెవి డి/  సి బ‌న‌స్కంత‌- రాధానేస్డా టిఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌కు చెందిన గోర‌ఖ్‌పూర్‌, భుజ్‌, రాధానెస్డా, రాయ‌గ‌ఢ్‌, పుగులూర్ స‌బ్ స్టేష‌న్లు. 
ఆర్థిక సంవ‌త్స‌రం 21 మొద‌టి ఆరు నెల‌ల్లో తన ఆధీనంలో ఉన్న సంస్థ‌ల‌తో స‌హా ప‌వ‌ర్ గ్రిడ్ భౌతిక ఆస్తులు 168,140 సికెఎం ట్రాన్్స‌మిష‌న్ లైన్లు, 252 స‌బ్ స్టేష‌న్లు, 419,800 ఎంవిఎ ప‌రిమాణ సామ‌ర్ధ్యం. 
ఆధునిక సాంకేతిక ప‌రిక‌రాల‌ను, ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించ‌డం ద్వారా, యాంత్రికీక‌ర‌ణను, డిజిట‌ల్ ప‌రిష్కారాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం ద్వారా ప‌వ‌ర్ గ్రిడ్ ఆర్ధిక సంవ‌త్స‌రం 21 మొద‌టి ఆరు నెల‌ల కాలంలో 99.83% స‌గ‌టు ప్ర‌సార వ్య‌వ‌స్థ‌ను అందుబాటులో ఉంచింది. 

 

***
 


(Release ID: 1672611) Visitor Counter : 120