శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్వర్ణ జయంతి ఫెలోషిప్‌కు పరిశోధకులను ఎంపిక చేసిన డీఎస్‌టీ
Posted On:
12 NOV 2020 4:00PM by PIB Hyderabad
లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, గణితం, భూమి మరియు వాతావరణం, భౌతిక శాస్త్రాలు, ఇంజినీరింగ్ రంగాలలో వినూత్న పరిశోధన ఆలోచనలతో సంబంధం ఉండి ఆర్‌అండ్‌డిపై ప్రభావం చూపే సామర్థ్యం కలిగి ఉన్న మొత్తం 21 మంది శాస్త్రవేత్తలను స్వర్ణ జయంతి ఫెలోషిప్ కోసం ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్తలు పరిశోధన ప్రణాళికలో ఆమోదించినట్లుగా ఖర్చుల పరంగా స్వేచ్ఛ, వశ్యతతో అపరిచిత పరిశోధన చేసేందుకు గాను అనుమతించబడతారు. స్వర్ణజయంతి ఫెలోషిప్ పథకాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాభైవ స్వాతంత్ర సంవత్సరం పురస్కరించుకొని శాస్త్ర, సాంకేతిక సరిహద్దు విభాగాలలో ప్రాథమిక పరిశోధనలను కొనసాగించడానికి వీలుగా.. నిరూపితమైన ట్రాక్‌రికార్డ్‌తో ఎంపిక చేసిన యువశాస్త్రవేత్తలకు ప్రత్యేక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద అవార్డు గ్రహీతలకు.. భారత ప్రభుత్వపు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) మద్దతునిస్తుంది. పరిశోధనలు చేయడానికి గాను అవసరమైన అన్ని రకాలైన అవసరాలను తీర్చడంతో పాటుగా.. ఐదేండ్ల కాలానికి గాను నెలకు రూ.25000 ఫెలోషిప్‌ను అందిస్తుంది. దీనికి తోడు ఐదు సంవత్సరాల కాలానికి ఐదు లక్షల రూపాయల గ్రాంట్‌ను కూడా అందిస్తుంది. మాతృ సంస్థ నుండి వారు తీసుకునే జీతానికి అదనంగా పరిశోధకులకు ఫెలోషిఫ్ కూడా అందిస్తారు. ఫెలోషిప్‌తో పాటు పరికరాలు, గణన సౌకర్యాలు, వినియోగపు వస్తువులు, కంటిన్‌జెన్సీలు, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రయాణం మరియు ఇతర ప్రత్యేక అవసరాలు ఏదైనా ఉంటే అవి కూడా ప్రతిభ ఆధారంగా అందిచబడుతాయి. ఫెలోషిప్‌లు శాస్త్రవేత్త ప్రత్యేకమైనవి మరియు సంస్థ-నిర్దిష్టమైనవి కావు. మేటిగా ఎంపిక చేసిన దగ్గరి విద్యా పర్యవేక్షణలను కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా శాస్త్ర మరియు సాకేంతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోశ్ శర్మ మాట్లాడుతూ "ఈ సంవత్సరం నుండి ప్రారంభమయ్యే కొత్త విధాన చర్యగా ఎస్‌జేఎఫ్ క్రింద చాలా ఎక్కువ మంది యువ శాస్త్రవేత్తలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించడమైంది. వీరిని గుర్తించడానికి, ప్రేరేపించడానికి మరియు వారు అత్యున్నత సామర్థ్యంతో పని చేయడానికి వీలుగా శక్తివంతం చేసేలా ఈ విధానం ఉంటుంది." కఠినమైన మూడు అంచెల స్క్రీనింగ్ ప్రక్రియతో 2020 ఫెలోషిప్ కోసం ఎంపిక చేసిన 21 మంది శాస్త్రవేత్తల జాబితాను అనుబంధం-1 లో ఇవ్వబడింది.
(Release ID: 1672433)
Visitor Counter : 141