ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పరిస్థితి, ప్రజారోగ్య చర్యలను ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, 7 రాష్ట్రాల సీనియర్ అధికారులతో సమీక్షించిన డాక్టర్ హర్ష్ వర్ధన్

"కోవిడ్ తగిన ప్రవర్తనను సమర్థించే ప్రధానమంత్రి జన్-ఆందోళన్ కోవిడ్ ని నిలువరించడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ వ్యూహాన్ని సంక్షిప్తీకరిస్తుంది"

"పండుగ మరియు శీతాకాల సమయంలో ఇప్పటివరకు సాధించిన ఫలితాలు నీరుగారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది"

"కోవిడ్ తగిన ప్రవర్తన అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్"

Posted On: 11 NOV 2020 4:29PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు మరియు 7 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు / అదనపు ప్రధాన కార్యదర్శులతో సంభాషించారు. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర మేఘాలయ మరియు గోవా ఉన్నాయి. టి. ఎస్. రావత్, ముఖ్యమంత్రి (ఉత్తరాఖండ్) రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఎన్. బిరెన్ సింగ్, ముఖ్యమంత్రి (మణిపూర్), శ్రీ రాజేష్ తోపే, ఆరోగ్య మంత్రి (మహారాష్ట్ర), డాక్టర్ ఆర్. లాల్తాంగ్లియానా, ఆరోగ్య మంత్రి (మిజోరాం), శ్రీ విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణే, ఆరోగ్య మంత్రి (గోవా),  పాఠశాల విద్య, ఉన్నత విద్య, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల (త్రిపుర) మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్వర్చ్యువల్ గా పాల్గొన్నారు.

డాక్టర్ హర్ష్ వర్ధన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, కేరళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ  రాష్ట్రాలు / యుటిలతో కోవిడ్ సంసిద్ధతను ఆయన సమీక్షించారు.

 


రాష్ట్ర-నిర్దిష్ట అంశాలపై దృష్టి పెట్టిన డాక్టర్ హర్ష్ వర్దన్ మహారాష్ట్రలో చురుకైన కేసులు తగ్గినప్పటికీ, అధిక మరణాల రేటు (2.6%) తో కూడిన, క్రియాశీలంగా ఉన్న కేసులోడు విపరీతంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని సిఎఫ్‌ఆర్- జాతీయ సగటు కంటే 1.64% ఎక్కువ; మణిపూర్‌లో ఇటీవలి రోజుల్లో చురుకైన కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అధిక పాజిటివ్ అంటే చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తోందని అర్థం అని ఆయన అన్నారు. గోవాలో గత ఒక నెలలో మొత్తం మరణాలలో 40% నమోదయ్యాయి, ఇది ఆందోళనకర విషయం. 70% కేసులు ఐజాల్‌లో కేంద్రీకృతమై ఉండటంతో, మిజోరామ్ చురుకైన కేసులలో మరింత పెరుగుతోంది. త్రిపుర మరియు మేఘాలయ చురుకైన వయస్సు సమూహాలలో (45-60 సంవత్సరాలు) అధిక మరణాలను (~ 37%) చూస్తున్నాయి, ఇవి నివారించగలిగేవే అని  కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

కోవిడ్ యోధులు, ముందువరుసలో ఉండే అగ్రేసరులు అలుపెరగని కృషితో అందించిన సేవలను డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రశంసించారు. తాజా లెక్కల ప్రకారం ఆక్సిజన్ ఆసరా‌పై కేవలం 4.09%, ఐసియులో 2.73% యాక్టివ్ కేసులు మరియు వెంటిలేటర్ సపోర్ట్‌పై చాలా చాల అల్పంగా 0.45% యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, రాబోయే శీతాకాలంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రసార గొలుసును ఆపడానికి, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన జన్-అందోళన్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. "ప్రధాన మంత్రి యొక్క తాజా ప్రసంగంలో, కోవిడ్ తగిన ప్రవర్తన ని కలిగి ఉండటానికి అందుబాటులో ఉన్న ఉత్తమమైన వ్యూహాన్ని సముచితంగా సంక్షిప్తీకరిస్తుంది." అని అన్నారు. ప్రజలలో జన్ ఆందోళన ను  ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ, "కోవిడ్ తగిన ప్రవర్తన అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్" అని అన్నారు.

డాక్టర్ హర్ష్ వర్ధన్ రాష్ట్రాలకు అధిక పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు, ముఖ్యంగా అధిక పాజిటివ్  ఉన్న జిల్లాల్లో; ర్యాట్ ద్వారా రోగలక్షణ నెగటివ్ యొక్క తప్పనిసరి పరీక్ష; ఇన్ఫెక్షన్ ను సూచించే ఎస్ఏఆర్ఐ/ఐఎల్ఐ పరీక్షలు వ్యాధి సోకడానికి ఆస్కారం ఉన్న సమూహాలు, జనాభాపై దృష్టి పెట్టాలన్నారు. ఇది సంక్రమణ సూచనను ఇస్తుంది; పాజిటివ్ కేసుల దగ్గరి పరిచయాలతో సంపర్కం అయిన వారి జాడను తెలుసుకునే పని జరగాలి అని తెలిపారు. ఇంటి ఐసొలేషన్ లో ఉన్నవారు సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణ కోసం ఆసుపత్రులకు చేరుకునే ప్రయత్నాలు  ముమ్మరం  తెలిపారు. మొదటి 24/48/72 గంటల్లో మరణాల సంఖ్య అధిక జిల్లాల్లో చోటుచేసుకుంటున్నాయని, అటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి తెలిపారు. బజార్, మార్కెట్ స్థలాలు, పని ప్రదేశాలు, సమావేశ స్థలాలు వంటి ప్రాంతాలలో అధిక పరీక్ష చేయవలసిన అవసరాన్ని ఆయన సూచించారు.
 

ముఖ్యమంత్రులు మరియు రాష్ట్ర ఆరోగ్య మంత్రులు తమ రాష్ట్రాల ఉత్తమ పద్ధతులతో పాటు కోవిడ్ పాజిటివ్ కేసుల నియంత్రణ, నిఘా మరియు చికిత్స కోసం తీసుకున్న చర్యల సంక్షిప్త స్నాప్‌షాట్‌ను పంచుకున్నారు. కోవిడ్ తగిన ప్రవర్తనను ప్రోత్సహించడం కోసం సమగ్ర మల్టీమీడియా ఐఇసి ప్రచారాన్ని తాము చేపట్టినట్లు ఉత్తరాఖండ్ సిఎం శ్రీ రావత్ చెప్పారు. 

 

 

 ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేయవలసిన అవసరాన్ని కలిగి ఉన్న మూడు రంగాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు సూచించారు; మరణాలను 1% కన్నా తక్కువ ఉంచడం; దీర్ఘకాలిక ప్రవర్తన శైలిలో మార్పునకు ప్రయత్నించాలని అన్నారు. వీటిని నిర్ధారించడానికి, శీఘ్రంగా మరియు దూకుడుగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మార్కెట్ స్థలాలు, కార్యాలయాలు, మత పరమైన కార్యక్రమాలలో గుముగూడిన ప్రాంతాల లక్ష్యంగా పరీక్షలు చేపట్టాలని సూచించారు. ఇవి సూపర్-స్ప్రెడర్ సంఘటనలుగా మారే అవకాశం ఉంది అని అన్నారు. కోవిడ్ సంబంధిత ప్రవర్తన పై ప్రజల్లో అవగాహన మరింత పెంచడానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. 

 

 

శ్రీమతి ఆర్తి అహుజా, అదనపు కార్యదర్శి (ఆరోగ్య), శ్రీ లవ్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి (ఆరోగ్య), డాక్టర్ ఎస్ కె సింగ్, డైరెక్టర్ (ఎన్‌సిడిసి), మంత్రిత్వ శాఖ ఇతర ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1672173) Visitor Counter : 202