రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఈ నెల 12 నుంచి ఈక్వెస్ట్రియన్ ఇంటర్నేషనల్ (ఎఫ్ ఈ ఐ ) ఈవెంట్

నాలుగు రోజుల పాటూ నిర్వహించనున్న ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా

Posted On: 11 NOV 2020 2:04PM by PIB Hyderabad

ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆర్మీ పోలో అండ్ రైడింగ్ సెంటర్ లో ఈ నెల 12 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈక్వెస్ట్రియన్ ఇంటర్నేషనల్ (ఎఫ్ ఈ ఐ ) ఈవెంట్ జరగనున్నది. ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నది.

 ఈ పోటీలను మూడు విభాగాలలో నిర్వహిస్తారు. డ్రెస్సేజ్ , క్రాస్ కంట్రీ మరియు షో జుంపింగ్ విభాగాలలో పోటీ జరుగుంతుంది. తక్కువ ​జరిమానాలు పొందిన పోటీదారుని అతను / ఆమె పాల్గొన్న విభాగంలో విజేతగా (వన్ స్టార్ ఇంట్రో మరియు టూ స్టార్ షార్ట్ ) నిలుస్తారు. నాలుగు రోజులపాటు సాగే ఈ టోర్నమెంట్ తోలి రోజున గుర్రాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రెండవ రోజున డ్రెస్సేజ్ పరీక్ష మూడవ రోజున షో జుంపింగ్ నిర్వహిస్తారు.

డ్రెసేజ్ పరీక్ష 60మీటర్లు x 20 మీటర్ల కొలతలు ఉన్న అరేనాలో నిర్వహిస్తారు. అరేనా వెలుపల స్థిరమైన దూరంలో గుర్తులను ఏర్పాటుచేస్తారు. అశ్వచోధకుడు తన గుర్రంతో పరీక్షలో ఇచ్చిన క్రమం ప్రకారం హాల్ట్, వాక్, ట్రోట్, క్యాంటర్ మొదలైన వివిధ కదలికలను చేయవలసి ఉంటుంది. 10 మార్కులు కలిగి ఉండే ఈ పోటీలో ప్రతి కదలికకు మార్కును ఇస్తారు. పోటీ ముగిసిన తరువాత ప్రతి న్యాయమూర్తి ఇచ్చే మార్కుల సగటుతో తుది డ్రస్సేజ్ స్కోరుశాతంని లెక్కిస్తారు.

మరుసటి రోజు, నిర్ణీత కాలపరిమితిలో ముందుగా నిర్ణయించిన అడ్డంకులతో ఒక నిర్దిష్ట పొడవున గుర్రం మరియు చోదకునికి క్రాస్ కంట్రీ పోటీ నిర్వహిస్తారు. తప్పిదానికి మొదటి సందర్భంలో 20 జరిమానాలు మరియు అదే జంప్ లో రెండవ తప్పిదానికి 40 జరిమానాలు విధిస్తారు. అదే అడ్డంకి వద్ద మూడవ తప్పిదానికి పాల్పడే పోటీదారుని పోటీ నుంచి తప్పిస్తారు. గుర్రం లేదా దానిని నడుపుతున్న వ్యక్తి కింద పడిపోయినా పోటీ నుంచి తప్పిస్తారు.

ఈవెంట్ యొక్క చివరి మరియు చివరి దశ షో జంపింగ్, ఇది 60మీటర్లు x 20 మీటర్ల కొలతలు ఉన్న షో జంపింగ్ అరేనాలో నిర్వహించబడుతుంది. ప్రతి డ్రాప్ / తిరస్కరణకు, 4 పాయింట్ల జరిమానాలు విధించబడతాయి. మూడవ తప్పిదం చేసే వారిని పోటీ నుంచి తొలగిస్తారు.

మూడు పోటీలలో సాధించిన మార్కులను లెక్కించి తుది ఫలితాలను నిర్ణయిస్తారు. 2018 ఆసియా క్రీడలలో భారత బృందం ఒక వ్యక్తిగత పతకాన్ని, భారత జట్టు వెండి పతకాన్ని గెలుచుకున్నాయి. ఆ తరువాత యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ "ప్రాధాన్యత" క్రీడగా గుర్తించి నిర్వహిస్తున్నది. వర్గీకరించబడింది. గత ఆసియా పోటీలలో భారతదేశం గుర్రపు స్వారీ విభాగంలో అత్యధిక పతకాలను సాధిస్తూ వస్తున్నది.

చైనాలో 2022లో జరుగనున్న ఆసియన్ క్రీడలకు సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 50 మంది చోదకులు 60 అశ్వాలతో కలసి పాల్గొని తామ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

***

 


(Release ID: 1671972) Visitor Counter : 163