శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతానికి విస్తరించిన కుంకుమపువ్వు (కేసరి) సాగు
ఈశాన్య ప్రాంతంలో కుంకుమపువ్వు సాగుకు సాధ్యాసాధ్యాలను శోధించడానికి ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టిన
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తెచ్చి అందించే ఈశాన్య ప్రాంత కేంద్రం (నెక్టర్ -NECTAR)
అదేవిధంగా కాశ్మీర్ లోని పాంపోర్ మరియు సిక్కిం లోని యాంగ్ యాంగ్ మధ్య ఉన్న వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితుల సారూప్యతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు యాంగ్ యాంగ్ లో కుంకుమ పువ్వు సాగును విజయవంతంగా నమూనా ప్రాంతంలో సాగుచేశారు.
కుంకుమపువ్వుపై ఏర్పాటు చేసిన జాతీయ మిషన్ కేసరి సాగును మరింత పెంచడానికి అనేక చర్యలు తీసుకోవడంపై తమ దృష్టిని కేంద్రీకరించింది.
Posted On:
09 NOV 2020 3:02PM by PIB Hyderabad
ఇంతకాలం కాశ్మీర్ కుంకుమపువ్వు కలశంగా ఉండేది. ఇకపైన త్వరలో అది ఈశాన్య భారతానికి విస్తరించనుంది. కాశ్మీర్ నుంచి సిక్కింకు కుంకుమపువ్వు మొక్కలను రవాణా చేసి వాటికి అనుకూలమైన వాతావరణంలో పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ మొక్కలు ఈశాన్య రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం యాంగ్ యాంగ్ లో పుష్పించడం మొదలెట్టాయి.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ లోని పరిమిత భౌగోళిక ప్రాంతానికి ఇంతకాలం కుంకుమపువ్వు సాగును పరిమితం చేశారు. ఇండియాలో కుంకుమ పువ్వు కలశంగా పరిగణించే పాంపోర్ ప్రాంతంలోనే కుంకుమ పువ్వు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాని తరువాత బుద్గాం, శ్రీనగర్ మరియు కిశ్తివార్ జిల్లాల్లో పండిస్తారు. కాశ్మీరీ వంటకాలలో కుంకుమ పువ్వు ఎక్కువగా వాడటం పరంపరగా వస్తోంది. . కుంకుమ పువ్వులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. అది సంపన్నమైన కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా ఉంటూ వస్తోంది. కాశ్మీర్ లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలోనే కుంకుమ పువ్వు సాగు చేస్తున్నందువల్ల ఉత్పత్తి పరిమితంగా ఉంది కుంకుమపువ్వుపై ఏర్పాటు చేసిన జాతీయ మిషన్ కేసరి సాగును మరింత పెంచడానికి అనేక చర్యలు తీసుకోవడంపై తమ దృష్టిని కేంద్రీకరించినప్పటికినీ ఆ చర్యలు మాంత్రం కాశ్మీర్ లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితమై పోయాయి.
భారతావనిలో ఈశాన్య ప్రాంతంలో కాశ్మీర్ లో సాగు చేసినంత నాణ్యతతో ఎక్కువ పరిమాణంలో కుంకుమపువ్వు పండించడానికి గల సాధ్యాసాధ్యాలను శోధించడానికి భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ 'నెక్టర్' కేంద్రం ప్రయోగాత్మక ప్రాజెక్టును పోషిస్తున్నది. సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీలోని వృక్ష శాస్త్ర మరియు ఉద్యానపాలన శాఖ సిక్కింలోని యాంగ్ యాంగ్ ప్రాంతంలో భూమి నాణ్యతను, దాని రసాయనిక లక్షణాలను, అసలు పి హెచ్ పరిమాణం ఎంతో తెలుసుకోవడానికి పరీక్షలు జరిపింది. యాంగ్ యాంగ్ భూమి కూడా కాశ్మీర్ లో కేసరి ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాలతో సరిపోలేదిగా ఉందని కనుగొన్నారు.
యూనివర్సిటీ విభాగం కాశ్మీర్ లో కుంకుమ పువ్వు గింజలు మరియు ధాన్యం కొని యాంగ్ యాంగ్ కు రవాణా చేసింది. కుంకుమ పువ్వు గింజలు నాటిన తరువాత ఎదుగుదల ప్రక్రియను కనిపెట్టి ఉండడానికి యూనివర్సిటీ అధ్యాపకవర్గంతో పాటు కుంకుమ పువ్వు పెంచేందుకు క్షేత్రంలో ఒకరిని ఉంచారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గింజలను నాటారు. దానివల్ల సమయానికి గింజలు మొలకెత్తి పుష్పించడం నిశ్చయమైంది. దానికి తోడు పాంపోర్ (కాశ్మీర్) మరియు యాంగ్ యాంగ్ (సిక్కిం) లలో వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితులు ఒకేవిధంగా ఉండటం వల్ల
నమూనా ప్రాంతంలో కుంకుమ పువ్వు సాగు విజయవంతమైంది.
సాగు తరువాత కుంకుమ పువ్వు నాణ్యతను పెంచడానికి ఆరబెట్టడం, శుభ్రం చేయడం వంటి పనులపై కూడా ప్రాజెక్టు దృష్టి కేంద్రీకృతమైంది. దానివల్ల దిగుబడి, ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.
ఇదిగాక కుంకుమ పువ్వు ఉత్పత్తికి సంబంధించి తక్షణ ఫలితాల కోసం భూమి నాణ్యతా పరీక్షలు, పరిమాణం, విలువ పెంచడం వంటి అన్ని ప్రమాణాలను విశ్లేషించి సూక్ష్మ ఆహార సంస్థలతో కలసి ఈశాన్య ప్రాంతంలోని ఇతర చోట్లలో ఈ ప్రాజెక్టు ఏర్పాటును గురించి శోధించడం జరుగుతుంది.
*****
(Release ID: 1671521)
Visitor Counter : 237