రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి ఎనిమిదో దశ సమావేశం
Posted On:
08 NOV 2020 8:10AM by PIB Hyderabad
సరిహద్దు వివాద పరిష్కారం కోసం, ఈనెల 6వ తేదీన భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి ఎనిమిదో దశ సమావేశం చుషుల్‌లో జరిగింది. భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లో, వాస్తవాధీన రేఖకు ఇరువైపులా సైనిక బలగాల ఉపసంహరణపై రెండు వర్గాలు లోతైన, నిర్మాణాత్మక చర్చలు జరిపాయి. రెండు దేశాల బలగాలు సయమనం పాటించేలా, అపార్థాలకు తావు లేకుండా, ఇరు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి అధికారులు ఉమ్మడిగా అంగీకరించారు. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని, ఈ సమావేశంలో జరిపిన చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిస్థితులను ఉమ్మడిగా కాపాడాలని ఇరు దేశాల కమాండర్ల సమావేశంలో రెండు వర్గాలు అంగీకరించాయి. త్వరలోనే మరోమారు సమావేశం కావాలని కూడా అధికారులు నిర్ణయించారు.
***
(Release ID: 1671204)
Visitor Counter : 237