మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐఐటి ఢిల్లీ 51 వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ .
దేశ అవసరాలను గుర్తించాల్సిందిగా గ్రాడ్యుయేట్లకు ప్రధానమంత్రి పిలుపు.
క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులతో అనుసంధానం కావల్సిందిగా సూచన.
యువతకు సులభతర జీవనం కలిపించేందుకు ఇండియా కట్టుబడి ఉంది. అందువల్ల వారు దేశ ప్రజలకు సులభతర జీవనం కల్పించడంపై దృష్టిపెట్టవచ్చు.
నాణ్యత,అద్భుతరీతిలో సామర్ధ్యంపెంపు , విశ్వసనీయత, నూతన పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం అనేవి ఐఐటియన్ల మంత్రంగా ఉండాలని పిలుపు
Posted On:
07 NOV 2020 4:35PM by PIB Hyderabad
దేశ అవసరాలను గుర్తించి , క్షేత్రస్థాయిలో మార్పులతో అనుసంధానమై ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో ,దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించాల్సిందిగా ఆయన వారిని క కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 51 వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొని ప్రసంగించారు.స్నాతకోత్సవం సందర్భంగా 2000 మంది ఐఐటియన్లను అభినందిస్తూ ఆయన, ఆత్మనిర్భర్ ప్రచారం యుతకు, సాంకేతిక నిపుణులకు , సాంకేతికరంగ వ్యాపార రంగ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.ప్రస్తుతం టెక్నో క్రాట్ల కొత్త కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను అమలు చేయడానికి, వాటిని మార్కెట్ చేయడానికి అనువైన వాతావరణం కల్పించడం జరిగిందన్నారు. యువత సులభతర జీవనానికి, ప్రస్తుతం దేశం కట్టుబడి ఉందని అంటూ ఆయన, వారు తమ వినూత్న ఆవిష్కరణల ద్వారా కోట్లాదిమంది దేశ ప్రజల జీవితాలలో మార్పులు తీసుకు రాగలరని అన్నారు. దేశం మీకు సులభతర వ్యాపారానకి అవకాశం కల్పిస్తుంది. మీరు దేశ ప్రజల సులభతర జీవనానికి కృషిచేయండి అని ప్రధానమంత్రి యువతకు సూచించారు. ఈ ఆలోచనతోనే ఇటీవల అన్ని కీలక రంగాలలో సంస్కరణలు తీసుకువచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. నూతన ఆవిష్కరణల, స్లార్టప్‌లకు కొత్త అవకాశాలు కల్పించిన రంగాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇతర సేవల ప్రొవైడర్లకు సంబంధించిన మార్గదర్శకాలు (ఒఎస్ పి)ని సులభతరం చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆంక్షలను తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది బిపిఒ పరిశ్రమకు వివిధ నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. బిపిఒ పరిశ్రమను బ్యాంకు గ్యారంటీ వంటి వాటితో సహా పలు అంశాలనుంచి మినహాయించడం జరిగింది. ఇంటినుంచి పనిచేయడానికి లేదా ఎక్కడినుంచైనా పనిచేయడానికి వీలు లేకుండా అడ్డంకిగా ఉన్న నిబంధనలను తొలగించడం జరిగిందన్నారు. ఇది ఐటి రంగాన్ని అంతర్జాతీయంగా పోటీకి నిలబెట్టడమే కాక, ప్రతిభగల యువతకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నదని తెలిపారు.కార్పొరేట్ పన్ను తక్కువ ఉన్న దేశాల జాబితాలో ఇండియా ఉన్నదని ప్రధానమంత్రి తెలిపారు. స్టార్టప్ ఇండియా ప్రచారం తర్వాత 50 వేలకు పైగా స్టార్టప్‌లు ఇండియాలో ప్రారంభమైనట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం స్టార్టప్‌లకు ఇచ్చిన ప్రోత్సాహంతో గత 5 సంవత్సరాలలో పేటెంట్ల సంఖ్య నాలుగు రెట్లుచ 5 రెట్లు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు పెరిగినట్టు ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సారాలలొ 20 భారతీయ యూనికార్న్‌లు ఏర్పాటయ్యాయని, ఈ సంఖ్య రాగల ఒకటి రెండు సంవత్సరాలలొ మరింత పెరగనున్నదని ఆయన అన్నారు.ఇవాళ ఇంక్యుబేషన్‌నుంచి ఫండింగ్ వరకు స్టార్టప్‌లకు సహాయం చేయడం జరుగుతోందని ప్రధానమంత్రి చెప్పారు. స్టార్టప్‌లకు ఫండింగ్ కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను 10 వేల కోట్లరూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇందుకు తోడు, మూడు సంవత్సరాల కాలానికి స్టార్టప్‌లకు పన్ను రాయితీ, స్వీయ సర్టిఫికేషన్, సులభంగా వైదొలగడానికి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద సుమారు 1లక్ష కోట్లకుపైబడిన పెట్టుబడులకు ప్రణాళిక రూపొందించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా అధునాతన మౌలికసదుపాయాలను కల్పించనుందన్నారు. ఇది ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్ అవసరాలను తీర్చనున్నదన్నారు. దేశం ప్రతిరంగంలో గరిష్ఠస్థాయిలో సామర్ధ్యాన్ని సంతరించుకునేందుకు కొత్త మార్గాలలో కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.ప్రధానమంత్రి విద్యార్ధులకు వారి పని ప్రదేశంలో ఉపయోగపడే నాలుగు మంత్రాలను తెలిపారు.నాణ్యతపై దృష్టిపెట్టండి, ఎన్నటికీ రాజీపడకండి.భారీస్థాయిపై దృష్టిపెట్టండి,మీ ఆవిష్కరణలు పెద్దసంఖ్యలో ఉపయోగపడాలి.విశ్వసనీయతకు పూచీపడండి.మార్కెట్‌లో దీర్ఘకాలిక విశ్వసనీయతకు వీలుకల్పించండి.నూతన పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం అలవరచుకోండి. మార్పును స్వాగతించండి, అనిశ్చితి ఒక జీవనవిధానంగా భావించండి అని వారికి సూచించారు.ఈ మౌలిక మంత్రాలపై పనిచేస్తూ ఎవరికి వారు తమ గుర్తింపును కాపాడుకుంటూ బ్రాండ్ ఇండియా గుర్తింపును కాపాడాలని అన్నారు. ఎందుకంటే భారతదేశపు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు విద్యార్ధులేనని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్ధుల కృషి దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తుందని, ఇది దేశ కృషిని మరింత ముందుకు తీసుకుపోతుందని ఆయన అన్నారు.కోవిడ్ అనంతర ప్రపంచం ఎంతో భిన్నంగా ఉండబోతున్నదని, అందులో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషించనున్నదని చెప్పారు. వర్చువల్ రియాలిటీ గురించి ఇంతకుముందు ఆలోచించనే లేదని అయితే ఇప్పుడు వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ అనేవి వర్కింగ్ రియాలిటీగా మారాయని అన్నారు. ప్రస్తుత బ్యాచ్ విద్యార్ధులు పనిప్రదేశంలో కొత్త వాతావరణం గురించి నేర్చుకునేందుకు అవకాశం కలిగిన బ్యాచ్ అని ఆయన తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన వారికి సూచించారు. కోవిడ్ -19 గ్లోబలైజేషన్ ప్రధానమని బోధించిందని, అయితే అదే సమయంలో స్వావలంబన కూడా అంతే ప్రాధాన్యత గలదని రుజువు చేసిందని చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం పాలన పేద ప్రజలకు చేరడంలో ఎంత శక్తిమంతమో ఇటీవలి కాలంలో దేశంలో రుజువైందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరువ అవుతున్నాయో ప్రధానమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన టాయిలెట్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ వంటి వాటిని ప్రస్తావించారు. సేవలను సత్వరం ప్రజలకు అందించడంలో దేశం అద్భుత కృషి చస్తున్నదని ఇది సామాన్య ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చిట్టచివరి స్థాయివరకు పథకాలు అందడానికి వీలు కలిగిందని, అవినీతికా ఆస్కారం లేకుండా పొయిందని అన్నారు. డిజిటల్ లావాదేవీల విషయంలో కూడా ఇండియా ప్రపంచంలోని పలు ఇతర దేశాల కంటే ఎ ంతో ముందున్నదని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారతదేశ ప్లాట్‌ఫారమ్‌లు అయిన యుపిఐలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాయన్నారు.స్వమిత్వ యోజనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఇటీవల ప్రారంభించిన ఈ పథకం కింద, తొలిసారిగా నివాస, భూమికి సంబంధించిన ఆస్తులను గుర్తించి తొలిసారిగా మ్యాపింగ్ చేయడం జరుగుతున్నదన్నారు.గతంలొఓ ఈ పనిని వ్యక్తిగతంగా చేసేవారని, అందువల్ల అనుమానాలు, భయాలు సహజంగా ఉండేవని అన్నానరు. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ ని ఉపయోగించి మ్యాపింగ్ చేస్తున్నారని, గ్రామస్థులు దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.దీనిని బట్టి సామాన్య ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తున్నదని అన్నారు. విపత్తుల అనంతర యాజమాన్యం విషయంలో, భూగర్భ జలాల నిర్వహణలో, టెలిమెడిసిన్ టెక్నాలజీలో, రిమోట్ సర్జరీలో బిగ్‌డాటా విశ్లేషణలో సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం ఎలా పరిష్కారాలను చూపగలదో ఆయన తెలిపారు. చిన్న వయసులోనే విద్యార్ధులు అద్భుత సామర్ధ్యాలతో అత్యంత కఠిన పరీక్షలను పాస్ అయినందుకు ప్రధానమంత్రి విద్యార్ధులను అభినందించారు. అదే సమయంలో వారి సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ వినయంతో ఉండాలన్నారు. అలాగే సరళంగా ఉండడమంటే స్వీయ గుర్తింపును కోల్పోవడం కాదని ఆయన అన్నారు. వినయం పెరిగే కొద్ది అత్యంత సామాన్యుడిగా మెలగాలని ఇది వారి సామర్ధ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విద్యార్ధులు, తల్లిదండ్రలు, అధ్యాపకులు, గైడ్లను అభినందించారు.ఐఐటి ఢిల్లీ వజ్రోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దశాబ్దానికి సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో విజయం సాధించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
***
(Release ID: 1671038)
Visitor Counter : 152