రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

2020 సెప్టెంబర్ 30వ తేదీ తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలోఎరువుల ఉత్పత్తి, అమ్మకాలతో రికార్డు స్థాయిలో 83.07 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన - ఫ్యాక్ట్

Posted On: 07 NOV 2020 2:55PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్), 2020 సెప్టెంబర్, 30వ తేదీ తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 83.07 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో ఇంత పెద్ద మొత్తంలో లాభాన్ని ఆర్జించడం సంస్థ చరిత్రలో ఇదే మొదటి సారి. గత ఏడాది ఇదే కాలంలో లాభం 6.26 కోట్ల రూపాయలు. సంస్థ ఈ త్రైమాసికంలో 1047 కోట్ల రూపాయల మేర టర్నోవర్ నమోదుచేయగా, గత ఏడాది ఇదే కాలంలో సంస్థ టర్నోవర్ 931 కోట్ల రూపాయలుగా నమోదయ్యింది. 

2020 సెప్టెంబర్, 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో, సంస్థ ప్రధాన ఉత్పత్తి అయిన ఫ్యాక్టమ్ ఫాస్ మరియు అమ్మోనియం సల్ఫేట్ యొక్క ఉత్పత్తి, అమ్మకాలు, గతంలో అన్ని త్రైమాసిక రికార్డులను అధిగమించాయి.

మొదటి అర్ధ సంవత్సరంలో, రెండు ఓడల్లో ఎం.ఓ.పి. ఎరువులను, ఒక ఓడలో ఎన్.పి.కె. ఎరువులను సంస్థ దిగుమతి చేసింది.

ముఖ్యాంశాలు 

*     గతంలో ఏ త్రైమాసికంలోనూ సాధించనంత ఎక్కువ మొత్తంలో 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్యాక్టమ్ ఫాస్ ఉత్పత్తి. 

*     గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ మొత్తంలో 0.69 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మోనియం సల్ఫేట్ ఉత్పత్తి. 

*     ఈ త్రైమాసికంలో ఫ్యాక్టమ్ ఫాస్ అమ్మకాలు 2.77 లక్షల మెట్రిక్ టన్నులకు, అమ్మోనియం సల్ఫేట్ అమ్మకాలు 0.08 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి.

*     ఎం.ఓ.పి. అమ్మకాలు 0.46 లక్షల మెట్రిక్ టన్నులు మరియు దిగుమతి చేసుకున్న ఎన్.పి.కె. అమ్మకాలు 0.26 లక్షల మెట్రిక్ టన్నులు.   

*     గతంలో ఏ అర్ధ సంవత్సరంలోనూ సాధించనంత ఎక్కువ మొత్తంలో 4.63 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్యాక్టమ్ ఫాస్ అమ్మకాలు.  

*     రెండవ త్రైమాసికంలో తీరప్రాంత షిప్పింగ్ మార్గం ద్వారా ఎరువులను పంపడం ప్రారంభించింది.

*     కంపెనీ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలలో కొత్త మార్కెట్లలోకి ప్రవేశించింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా పరిమితులు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం మరియు కేరళ ప్రభుత్వం జారీ చేసిన అన్ని కోవిడ్ నిబంధనలను, మార్గదర్శకాలను పాటిస్తూ,  సంస్థ అత్యుత్తమ పనితీరును సాధించింది.

*****


(Release ID: 1671006) Visitor Counter : 145