పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశీయ విమానయాన ప్రస్తుత ఛార్జీలనే 2021 ఫిబ్రవరి, 24వ తేదీ వరకు పొడిగించారు
రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 2 లక్షలకు పైగా చేరుకుంది
प्रविष्टि तिथि:
05 NOV 2020 6:12PM by PIB Hyderabad
దేశీయ విమానయాన ప్రస్తుత ఛార్జీలనే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, 2021 ఫిబ్రవరి, 24వ తేదీ వరకు పొడిగించింది. ఈ ఛార్జీలు 2020 మే, 21వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.
2020 నవంబరు 1వ తేదీన రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 2.05 లక్షలకు చేరుకుంది. 2020 మే నెలలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు, విమానయాన సంస్థలు సాధారణ సామర్థ్యంలో 33 శాతం వరకు మాత్రమే ప్రయాణించటానికి వీలు కల్పించాయి (2020, వేసవి షెడ్యూల్ ప్రకారం). ఆ సమయంలో, రోజువారీ ప్రయాణీకుల సగటు సుమారు 30,000 గా ఉంది. ఈ పరిమితిని, 2020 జూన్, 26వ తేదీ నుంచి 45 శాతానికీ, ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 2వ తేదీ నుండి 60 సతానికీ పెంచడం జరిగింది. ప్రస్తుతం విమానయాన సంస్థలు తమ సామర్థ్యంలో 60 శాతం వరకు వినియోగించుకోవచ్చు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ ప్రయాణీకుల రద్దీని పర్యవేక్షిస్తోంది. పండుగ సీజన్ కారణంగా ట్రాఫిక్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ పెరిగేకొద్దీ, రాబోయే రోజుల్లో ఎగువ పరిమితిని, సాధారణ సామర్థ్యంలో 70 నుండి 75 శాతం వరకు సవరించే అవకాశం ఉంది.
*****
(रिलीज़ आईडी: 1670851)
आगंतुक पटल : 216