మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటి ఖరగ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్

“భరతా తీర్థ” పేరుతో ఐఐటి ఖరగ్‌పూర్ నిర్వహించనున్న 3 రోజుల అంతర్జాతీయ వెబ్‌నార్‌ను ప్రారంభించిన మంత్రి

Posted On: 06 NOV 2020 5:57PM by PIB Hyderabad

ఐఐటి ఖరగ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. నవంబర్ 6 నుండి3 రోజుల పాటు సంస్థ నిర్వహించనున్న భరతా తీర్థఅనే అంతర్జాతీయ ​​సదస్సునుమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. భారత ​​జ్ఞానవ్యవస్థలో వివిధ శాఖలలో ఐఐటీ సాగిస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి భారత దేశం అమలు చేస్తున్న చర్యలను,దేశ స్ఫూర్తి ​ని భారత తీర్థ మరియు పరిశోధనల ద్వారా ప్రతిబించడం ​పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ​మాతృ భాషలో విద్యను అందించడం ద్వారా దెస సంస్కృతిని పరిరక్షించవచ్చునని మంత్రి అన్నారు. మాతృ భాషకు తోడుగా సంస్కృతాన్ని బోధించడం ద్వారా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షించవచ్చునని మంత్రి పేర్కొన్నారు. సాంకేతిక విద్యను అందించడానికి జాతీయ సాంకేతిక విద్యా సంస్థను నెలకొల్పుతామని మంత్రి ప్రకటించారు. దీనిద్వారా పరిశోధకులు భారత శాస్త్రీయ పరిజ్ఞానం, భాషాపరమైన చరిత్ర మరియు చరిత్రపై మరింత లోతుగా దృష్టి సారించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. ' స్టడీ ఇన్ ఇండియా, గ్యాన్, గ్యాన్ + లాంటి కార్యక్రమాలకు నిధులను అందచేస్తూ ఈ అంశాలలో పరిశోధకులు, విదేశీ విద్యార్థులను ​ప్రోత్సహిస్తున్నాం ' అని మంత్రి వివరించారు. అనేక సవాళ్లను ఎదుర్కొని భారతదేశం తన సంస్కృతిని రక్షించుకున్న అంశంపై మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని మంత్రి అన్నారు.

గౌరవ అతిధిగా పాల్గొన్న శ్రీ సంజయ్ ఢోత్రే ​ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ అంశాలతో ముడిపడివున్న భారతదేశ ​ ​​జ్ఞానఅంశాలపై లోతుగా దృష్టి సారించవలసి ఉన్నదని అన్నారు. ' గతంలో సాధించిన విజయాలు మనలో స్ఫూర్తిని నింపవచ్చును. అయితే, ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ​సాగించడానికి ఎక్కువగా ఉపయోగపడవు. ఎంపిక చేసుకున్న ప్రతి రంగంలో విజయం సాధించడారంగాల నికి విలువలు, భరతఃజ్ఞానసంపదను జోడించవలసి ఉంటుంది' అని ఆయన అన్నారు. ఎన్ఈపి 2020 భారత దేశ స్ఫూర్తిని మరింత పెంపొందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ' ​ ఎన్ఈపి 2020 ని సామాజిక, నైతిక విలువలు, మానసిక సామర్ధ్య అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించడం జరుగుతున్నది. దీనివల్ల వివిధ భౌగోళిక, ఆర్ధిక, సామాజిక రంగాలకు చెందిన విద్యార్థులకు విలువలతో కూడిన సమగ్ర విద్య అందుబాటులోకి వస్తుంది. ఇంతకాలం చరిత్రపరంగా సరైన గుర్తింపు పొందని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ' అని ఆయన తెలిపారు.

​శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును నెలకొల్పి భారతదేశ శాస్త్రీయ చరిత్రపై జరుగుతున్న పరిశోధనలను ప్రోత్సహించాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర కే తివారి కోరారు. ' భారతదేశంలో ఎస్ఎస్ భట్నాగర్ అవార్డును సాధించాలని ప్రతి ఒక్క ​పరిశోధకుడు ప్రయత్నిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు శాస్త్రీయ పరిశోధనలకు కూడా ఈ అవార్డును నెలకొల్పాలని నేను కేంద్ర మంత్రిని కోరుతున్నాను 'అని ఆయన అన్నారు.

మూడు రోజులపాటు సాగే ఈ సెమినార్ లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన పరిశోధకులు సంస్కృతంలో ఆర్ధిక శాస్త్రం, పురాతన భారత గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిషం, ప్రకృతి వైద్యం, వాస్తు శాస్త్రం తదితర అంశాలపై ప్రసంగిస్తారు.

  ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు శ్రీ సంజీవ్ సన్యాల్, భారతదేశం మరియు అర్థశాస్త్రంపై యునిసెఫ్, ఉజ్బెకిస్తాన్ (యూరప్ మరియు మధ్య ఆసియా ప్రాంతం) ముఖ్య విద్యాధికారి డాక్టర్ దీపా శంకర్, ప్రొఫెసర్. జెరార్డ్ హుయెట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, ప్రొఫెసర్ అంబా కులకర్ణి, సంస్కృత అధ్యయన విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంస్కృతానికి సహజ భాషా ప్రాసెసింగ్, ప్రొఫెసర్ క్లెమెన్సీ మోంటెల్లె, కాంటర్బరీ విశ్వవిద్యాలయం, న్యూజిలాండ్ మరియు ప్రొఫెసర్ కె. రామసుబ్రమణియన్, వేద మరియు ప్రాచీన భారతీయ గణితంపై ఐఐటి బొంబాయి, ప్రొఫెసర్ బి.ఎమ్. మితాలి ముఖర్జీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, ఆయుర్వేదంపై న్యూ Delhi ిల్లీ, ప్రొఫెసర్ మయాంక్ ఎన్. వాహియా, ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మరియు పొజిషనల్ అండ్ ఖగోళ శాస్త్రాలపై ఐఐటి ఖరగ్పూర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితాభా ఘోష్, ప్రొఫెసర్ అరుణేండు బెనర్జీ, విశ్వభారతి, శాంతినికేతన్ మరియు రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం మరియు ప్రొఫెసర్, ఓంకర్నాథ్ టెర్రన్ / మెటీరియల్ ఎకాలజీ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, గుర్గావ్‌లోని ది డ్రోనాహ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ శిఖా జైన్ మరియు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, శాన్ బెర్నార్డినో, అమెరికాలోని ఆర్కియాలజీ, ఐకానోగ్రఫీ మరియు ఆర్కిటెక్చర్ పై పట్టణ మరియు ప్రాంతీయ భౌగోళిక నిపుణుడు డాక్టర్ రాజరాణి కల్రా   ​ప్రసంగించనున్నారు చెన్నై సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎండి శ్రీనివాస్ కీలక ఉపన్యాసం ఇస్తారు.

***

 



(Release ID: 1670818) Visitor Counter : 95