రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రూ.451 కోట్ల ఆదాయ లక్ష్యంతో 'కెమికల్స్‌&పెట్రో కెమికల్స్‌ విభాగం'తో 'హెచ్‌ఐఎల్‌' అవగాహన ఒప్పందం

Posted On: 06 NOV 2020 2:37PM by PIB Hyderabad

కెమికల్స్‌&పెట్రో కెమికల్స్‌ విభాగంతో, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హెచ్‌ఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఇటీవల అవాగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.451 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం హెచ్‌ఐఎల్‌ లక్ష్యం.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG_20201106_114442XBNP.jpg

    హెచ్‌ఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌ సీఎండీ శ్రీ ఎస్‌.పి.మొహంతి, కెమికల్స్‌&పెట్రో కెమికల్స్‌ విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్‌ కుమార్‌ చతుర్వేది ఎంవోయూ మీద సంతకాలు చేశారు.

    "రూ.451 కోట్ల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. మొదటి రెండు త్రైమాసికాల్లో హెచ్‌ఐఎల్‌ 65 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో ఉత్పత్తయిన 375.5 మె.ట. 'మలాథియన్‌ టెక్నికల్‌'తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఉత్పత్తి 530.10 మె.ట. సంస్థ చరిత్రలో ఇదే అత్యధికం" అని మొహంతి చెప్పారు.

    అంతేగాక, తొలి రెండు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో విక్రయాలను హెచ్‌ఐఎల్‌ చేయగలిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ చేపట్టిన మిడతల నియంత్రణ కార్యక్రమానికి, క్రిమికీటకాల నిరోధానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఉత్పత్తులను అందించింది.

***



(Release ID: 1670697) Visitor Counter : 152