రైల్వే మంత్రిత్వ శాఖ

పంజాబ్లోని 32 ప్రాంతాల్లోని రైల్వే ప్రాంగణాల్లో, ట్రాక్లపై ఇప్పటికీ ఆందోళన కొనసాగుతోంది

పంజాబ్‌లోని రైల్వే స్టేషన్లలో ట్రాక్‌లకు నిరసనకారులు అడ్డుపడటం వల్ల, సరుకు రవాణా కార్యకలాపాలు బలవంతంగా నిలిపివేయడం వల్ల రైల్వేలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి.

ఇప్పటి వరకు 2225 కంటే ఎక్కువ సరుకు రవాణా రేకులు (గూడ్స్రైళ్లు) కీలకమైన వస్తువులను రవాణా చేయలేకపోయాయి. దీంతో రైల్వేకు నష్టం ఇప్పటికే రూ .1200 కోట్లు దాటిందని భావిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌ల వద్ద / రైల్వే ట్రాక్ సమీపంలో ఆందోళనకారులు ధర్నా కొనసాగించారు. కార్యాచరణ , భద్రతా విషయాల కారణంగా రైలు సేవలను మళ్లీ నిలిపివేశారు. ఆందోళనకారులు అకస్మాత్తుగా కొన్ని రైళ్లను అడ్డుకున్నారు. ముఖ్యంగా జండియాలా, నభా, తల్వాండి సాబో , బటిండా చట్టుపక్కల ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. రైలు పట్టాలపై భైఠాయించారు.

ట్రాక్‌లకు భద్రత కల్పించడానికి , కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి రైల్వే సిబ్బందికి భరోసా కోరుతూ రైల్వే మంత్రి 2020 అక్టోబర్ 26 న పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

పంజాబ్‌లోని ట్రాక్‌ల సెక్షన్లలో నిరవధిక అడ్డంకుల కారణంగా, సరుకు రవాణాపై పెద్ద ప్రతికూల ప్రభావం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక , మౌలిక సదుపాయాల రంగానికి కీలకమైన వస్తువుల సరఫరాలక

Posted On: 04 NOV 2020 12:52PM by PIB Hyderabad

పంజాబ్‌లో సరుకు రవాణా కార్యకలాపాలు బలవంతంగా నిలిపివేసినందున రైల్వేలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు 2225 కంటే ఎక్కువ సరుకు రవాణా రేక్స్ (గూడ్స్రైళ్లు) కీలకమైన వస్తువులను రవాణా చేయలేకపోతున్నాయి. ఫలితంగా రైల్వేకు నష్టం ఇప్పటికే రూ .1200 కోట్లు దాటిందని భావిస్తున్నారు.

ప్లాట్‌ఫామ్‌ల వద్ద / రైల్వే ట్రాక్ సమీపంలో ఆందోళనకారులు ధర్నా కొనసాగించారు. కార్యాచరణ , భద్రతా విషయాల కారణంగా రైలు సేవలను మళ్లీ నిలిపివేశారు. ఆందోళనకారులు అకస్మాత్తుగా కొన్ని రైలు కదలికలను అడ్డుకున్నారు. ముఖ్యంగా జండియాలా, నాభా, తల్వాండి సాబో , బటిండాతోపాటు చుట్టుపక్కల ప్రదేశాలలో రైళ్ల దిగ్బంధనం కొనసాగుతోంది. ఈ రోజు 06:00 గంటలకు అందిన నివేదిక ప్రకారం,  32 ప్రదేశాలలో ఆందోళనలు కొనసాగాయి.

ట్రాక్‌లకు భద్రత కల్పించడానికి , కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి రైల్వే సిబ్బందికి భరోసా కోరుతూ రైల్వే మంత్రి 2020 అక్టోబర్ 26 న పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

పంజాబ్‌లోని ట్రాక్‌సెక్షన్లలో నిరంతర అడ్డంకుల కారణంగా సరుకు రవాణా స్తంభించింది.   వ్యవసాయ, పారిశ్రామిక , మౌలిక సదుపాయాల రంగానికి కీలకమైన వస్తువుల లభ్యత నిలిచిపోయింది.  పంజాబ్ రాష్ట్రం మీదుగా వెళుతున్న అన్ని ప్యాసింజర్ రైళ్లకు అంతరాయాలు కలిగాయి. ఇప్పటి వరకు 1350 కి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు లేదా దారి మళ్లించారు లేదా తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కోవిడ్ కాలంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.  పంజాబ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్లకు నిత్యావసరాలు సహా అన్ని రకాల వస్తువుల రవాణా నిలిచిపోయింది.  లోడ్ చేయబడిన రైళ్లతో సహా అనేక సరుకు రవాణా రైళ్లు 15-20 రోజుల నుంచి పట్టాలపై నుంచి కదలడం లేదు. సరుకు రవాణాదారులకు ఆందోళనల వల్ల నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ రవాణా విధానాలను ఎంచుకుంటున్నారు.  పంజాబ్ ప్రాంతం నుండి ఔట్వర్డ్ లోడింగ్ కూడా ప్రభావితమైంది. ధాన్యం, కంటైనర్, ఆటోమొబైల్, సిమెంట్, పెట్ కోక్, ఎరువులు మొదలైన వాటి  రవాణా ఆగిపోయింది. రోజుకు 40 రేక్‌లు వీటిని రవాణా చేస్తాయి.  పంజాబ్‌ లోపలి ట్రాఫిక్ కూడా ప్రభావితమైంది (పంజాబ్ ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల నుండి)  కంటైనర్, సిమెంట్, జిప్సం, ఎరువులు, పిఒఎల్ మొదలైనవి పంజాబ్‌లోని ముఖ్య ప్రదేశాలకు చేరుకోలేకపోతున్నాయి. రోజుకు సగటు నష్టం రోజుకు 30 రేక్స్.

పంజాబ్‌లో రైతుల ఆందోళన: నేపధ్యం

ఈ ఏడాది సెప్టెంబరు 24 నుంచి పంజాబ్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌లను , స్టేషన్లను రైతులు అడ్డుకుంటున్నారు. గత నెల ఒకటో తేదీ నుండి, పంజాబ్ అంతటా ఆందోళన వ్యాపించడంతో అన్ని రైళ్లను నిలిపివేయవలసి వచ్చింది. ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో అన్ని రైళ్లు ఆగిపోయాయి. ఈ డివిజన్ పంజాబాలోని అంబాలా, ఢిల్లీలో, బికనీర్  కొంత మేర ఉంటుంది.  తరువాత,  కొన్ని రకాల వస్తువుల రైలు కదలికను గత నెల పదో తేదీ నుండి ఆందోళనకారులు అనుమతించారు. సరుకు రవాణా రైలు కదలిక తిరిగి ప్రారంభమైన రెండు రోజుల తరువాత నిర్వహణ , భద్రతాపరమైన కారణాల వల్ల దీనిని మళ్ళీ వాటిని నిలిపివేయవలసి వచ్చింది, ముఖ్యంగా అమృత్సర్, నాభా, తల్వాండి సాబో, ఫిరోజ్‌పూర్, మోగా, జండియాలా , బటిండా చుట్టూ వివిధ ప్రదేశాలలో అప్పుడప్పుడు దిగ్బంధనం కొనసాగింది. ఇప్పటికీ కొన్ని ట్రాకుల సెక్షన్లపై దిగ్బంధనాలను కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు అదుపులోకి రాకపోతే రైళ్లను నడపడం ప్రమాదకరమవుతుంది. ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు 32 చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.  

***

 


(Release ID: 1670287) Visitor Counter : 203