రక్షణ మంత్రిత్వ శాఖ
ఆధునీకరించిన పినాకా రాకెట్ సిస్టమ్ ఫ్లైట్ టెస్టింగ్ విజయవంతం
Posted On:
04 NOV 2020 6:01PM by PIB Hyderabad
'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ఆధునీకరించి పినాకా రాకెట్ వ్యవస్థను ఈ రోజు (నవంబర్ 04,2020) ఒడిశా రాష్ట్ర తీరం చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించారు. మునుపటి రూపకల్పనతో పోలిస్తే.. తగ్గిన పొడవుతో సుదీర్ఘ శ్రేణి పని తీరును సాధించడానికి గాను మెరుగైన పినాకా వ్యవస్థ అభివృద్ధి జరిగింది.
ఈ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధిని పూణే ఆధారిత డీఆర్‌డీఓ ప్రయోగశాలల్లో చేపట్టారు. ఆర్మమెంట్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఏఆర్‌డీఈ
మరియు హై ఎనర్జీ మెటీరియల్స్ రీసర్చ్ లాబొరేటరీ, హెచ్ఎంఆర్ఎల్‌లో ఆయా పనులను చేపట్టారు. ప్రయోగంలో భాగంగా మొత్తం ఆరు రాకెట్లను వెంటవెంటనే ఇక్కడ నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్ల పరీక్షలు పూర్తిగా మిషన్ లక్ష్యాలను చేరుకున్నాయి. పరీక్షించిన ఈ రాకెట్లను నాగ్‌పూర్‌లోని మెస్సర్స్ ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ తయారు చేసింది. వీరికి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయబడింది. ఈ విమాన ఆర్టికల్స్‌ను టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ రేంజ్ సాధనాలను ట్రాక్ చేశారు. ఇది విమానాల పనితీరును నిర్ధారించింది. ఆధునీకరించిన పినాకా రాకెట్ వ్యవస్థ ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న పినాకా ఎంకె రాకెట్స్ స్థానంలో అందుబాటులోకి తేనున్నారు.
*****
(Release ID: 1670231)
Visitor Counter : 279