కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కార్మికుల బీమా కార్పొరేషన్‌లో(ఈఎస్ఐసీ) విజిలెన్స్ అవగాహన వారోత్సవం
Posted On:
03 NOV 2020 5:19PM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 'కార్మికుల బీమా కార్పొరేషన్'కు (ఈఎస్ఐసీ) చెందిన ఆసుప్రతులు, ఢిల్లోలోని ఈఎస్ఐసీ ప్రధాన కార్యాలయం, కార్పొరేషన్‌కు చెందిన క్షేత్రస్థాయి కార్యాలయాలలో అక్టోబరు 27వ తేదీ నుంచి నవంబరు 2వ తేదీ వరకు "విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్" (విజిలెన్స్ అవగాహనపు వారోత్సవాలు) ఉత్సాహంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా వాటాదారులు, ప్రజలలో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల్ని నిర్వహించారు.
ప్రజాప్రయోజనానికి ఈఎస్ఐసీ చేపడుతున్న వివిధ కార్యకలాపాలపై అవగాహన కల్పించేలా ఈ వారోత్సవాలలో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవం థీమ్.. “విజిలెంట్ ఇండియా.. సంపన్న భారత దేశం”. విజిలెన్స్ అవగాహన వారోత్సవం 27.10.2020న అధికారులు మరియు సిబ్బంది సమగ్రత ప్రతిజ్ఞతో ప్రారంభమైంది. 29.10.2020న జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీమతి అనురాధ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ జీవితంలో సమగ్రత, నిజాయితీగా ఉండాల్సిన ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పారు. ఈఎస్ఐసీ సంస్థ సీవీఓ శ్రీమతి గారిమా భగత్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మేటి సమాచారంతో కూడిన సందేశం ఇచ్చారు.
"ప్రొక్యూరిమెంట్ సమగ్రత ప్రమాదాల మ్యాపింగ్- ముందస్తు నివారణ విజిలెన్స్ విధానం"పై సమాచారంతో కూడిన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి హజరైన
అన్ని క్షేత్ర కార్యాలయాలు / ఆసుపత్రుల వారు ఈ ప్రసంగాన్ని ప్రశంసించారు.
ఈఎస్ఐసీ ప్రధాన కార్యాలయంలో ఈ సంవత్సరం విజిలెన్స్ వారోత్సవం థీమ్ మరియు ఇతర విజిలెన్స్ సంబంధిత అంశాలపై పోస్టర్ తయారీకి సంబంధించి పోటీలు నిర్వహించబడినాయి. ఇందులో ఈఎస్ఐసీ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోస్టర్ తయారీ పోటీలలో వివిధ విభాగాలలోని విజేతలను ప్రకటించారు. ఇందులో మిస్ శ్రేయా సింగ్ (4 - 12 సంవత్సరాల కేటగిరీ), మిస్ చాహత్ మొంగియా (13- 23 సంవత్సరాల కేటగిరీ), శ్రీమతి లక్ష్మి బిష్ట్ (24 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కేటగిరీ) విజేతలుగా నిలిచారు. వీరికి బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో మేటిగా ఎంపిక చేసిన పోస్టర్లు ప్రజలలో అవగాహన కోసం ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించబడతాయి.
*****
(Release ID: 1669902)
Visitor Counter : 191