బొగ్గు మంత్రిత్వ శాఖ

తొలిరోజు ఉల్లాసంగా సాగిన వాణిజ్య బొగ్గు గనుల వేలం

Posted On: 02 NOV 2020 6:24PM by PIB Hyderabad

బొగ్గు అమ్మకాల కోసం బొగ్గు గనులను వేలం కార్య‌క్ర‌మం తొలిరోజు ఉల్లాసంగా ముందుకు సాగింది. తొలిరోజు బొగ్గు గ‌నుల వేలానికి బిడ్డర్ల నుంచి బలమైన, ఆరోగ్యకరమైన పోటీ క‌నిపించింది. వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గుగనుల వేలంను
బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్ 18, 2020న ప్రారంభించింది. రెండు దశల ఫార్వర్డ్ వేలం ప్రక్రియగా (ప్రారంభ ఆఫర్ మరియు ఫైనల్ ఆఫర్‌తో సహా) దీనిని బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియ‌ను చేప‌ట్టింది. ఈ ప్ర‌క్రియ‌లో బిడ్డర్లు రిజర్వ్ ధర కంటే ఎక్కువ శాతం రెవెన్యూ షేర్‌తో బిడ్ వెయ్యాల్సి ఉంటుంది.

- బొగ్గు మంత్రిత్వ శాఖ వేలానికి ఉంచిన బొగ్గు ‌బ్లాక్‌‌లు బిడ్డర్లలో విస్తృతమైన‌ ఆసక్తిని కలిగించాయి. ఆఫర్‌లో వారు వివిధ బొగ్గు బ్లాకుల కోసం బిడ్ల‌ను సమర్పించారు.

-ఈ వేలంలో భాగంగా బిడ్డర్లు సమర్పించిన సాంకేతిక బిడ్లు మూల్యాంకనం చేయబడ్డాయి. ఈ మూల్యాంక‌నంలో భాగంగా సాంకేతికంగా అర్హత కలిగిన ప‌లువురు బిడ్డర్ల జాబితాను ప్రకటించారు. దీనికి అనుగుణంగా బొగ్గు గనుల వాణిజ్య ప్రయోజనం కోసం బొగ్గు గనుల ఎలక్ట్రానిక్ వేలం.. ఈ రోజు ఉదయం 11:00 గంటలకు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

- ఈ-వేలంలో మొదటి రోజు బలమైన పోటీని చ‌విచూసింది కొన్ని గనుల వేలం 3-4 గంటలకు పైగా జరుగుతోంది.

- వేలం వేసిన అన్ని గనులలో ఫైన‌ల్ ఆఫర్ 10 శాతం పైననే ఉంది, ఇది మార్కెట్లో బొగ్గు గనులకు ఉన్న బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది.

తొలి రోజు ఫలితాలు కింద‌న‌ ఇవ్వబడ్డాయి:

 

S. No.

Name of the Mine

State

PRC (mtpa)

Geological Reserves (MT)

Closing Bid Submitted by

Reserve Price (%)

Final Offer (%)

Annual Revenue Generated (Rs. Cr.)

1

Takli Jena Bellora North and Takli Jena Bellora South

Maharashtra

1.50

117.26

AUROBINDO REALITY AND INFRASTRUCTURE PRIVATELIMITED/146875

4

30.75

267.16

2

Urtan

Madhya Pradesh

0.65

55.391

JMS MINING PRIVATE LIMITED/147074

4

10.50

124.27

3

MarkiMangli II

Maharashtra

0.30

11.44

YAZDANI INTERNATIONAL PVT. LTD. / 148341

4

30.75

53.43

4

Radhikapur West

Odisha

6.00

312.04

VEDANTA LIMITED/68522

4

21.00

592.28

5

Chakla

Jharkhand

5.30

76.05

HINDALCO INDUSTRIES LIMITED/64856

4

14.25

519.54

 

 

***



(Release ID: 1669628) Visitor Counter : 195