యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జిరాక్‌పూర్‌లో శాయ్ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, దేశవ్యాప్తంగా మరిన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాల ఏర్పాటే లక్ష్యమని వెల్లడి
Posted On:
02 NOV 2020 4:27PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజుజు, పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌లో, భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) కొత్తగా ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తర భారతదేశంలోని శాయ్ ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా ఇది ఉంటుంది.
శాయ్ కేంద్రం శిక్షకులు, క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ పరిస్థితి బాగుపడిన తర్వాత, కొత్త కేంద్రాన్ని సందర్శిస్తానని చెప్పారు.
"జమ్ముకశ్మీర్, లెహ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్ వరకు అతి పెద్ద ప్రాంతంగా ఉత్తర భారతదేశం విస్తరించి ఉంది. భారత్‌లో ప్రపంచస్థాయి క్రీడా సదుపాయల ఏర్పాటు లక్ష్యంగా, ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. భారత భవిష్యత్ ఆశా కిరణాలు, మన దేశాన్ని క్రీడల కేంద్రంగా మార్చగల ఈ ప్రాంత యువతను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాం" అని కిరణ్ రిజిజు వెల్లడించారు.
జిరాక్‌పూర్ శాయ్ కొత్త కేంద్రం పరిపాలన భవనాన్ని కేంద్ర ప్రజాపనుల విభాగం నిర్మించింది. త్వరలోనే మరిన్ని క్రీడా సదుపాయలను ఇక్కడ ఏర్పాటు చేయనుంది.
పంజాబ్ క్రీడల అధికారులు, శాయ్ ఉన్నతాధికారులు, శాయ్ ప్రాంతీయ కేంద్రాల డైరెక్టర్లు, శిక్షకులు, క్రీడాకారులు మొత్తం 300 మందికి పైగా వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1669519)
Visitor Counter : 187