జల శక్తి మంత్రిత్వ శాఖ
మిజోరంలో జల్‌జీవన్ మిషన్ అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించిన జల్‌శక్తి మిషన్
2022-23 నాటికి రాష్ట్రంలో సార్వత్రిక అమలుకు సంబంధించి నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాల్సిందిగా సూచన
Posted On:
01 NOV 2020 11:36AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం జల్‌జీవన్ మిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు పురోగతికి సంబంధించి జలశక్తి మంత్రిత్వశాఖ మధ్యంతర సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, మిజోరం రాష్ట్ర అధికారులు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రణాళిక, అమలును వీడియో కాన్ఫరెన్సు ద్వారా జల్‌శక్తి మంత్రిత్వశాఖ ముందుంచారు.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల కష్టాలు, ప్రత్యేకించి మహిళలు, బాలికల కష్టాలను తొలగించేందుకు , వారిజీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జలశక్తి మంత్రిత్వశాఖ జల్‌జీవన్‌మిషన్‌ను రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలుకు కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకు ట్యాప్‌కనక్షన్ కల్పించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వనిధులు, రాష్ట్రాల మ్యాచింగ్ నిధులను వినియోగించడం ఆధారంగా నిధులను భారత ప్రభుత్వం అందజేస్తుంది.
2022-23 నాటికి గ్రామీణ ప్రాంతాలల కుటుంబాలకు నూరుశాతం మంచినీటి ట్యాప్ కనెక్షన్ అందించాలని మిజోరం ప్రణాళికతో ఉంది. మిజోరం రాష్ట్రంలో 1.27 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 1.02 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు లేవు. 2020-21 సంవత్సరంలో 31,967 ఇళ్లకు మంచినీటి ట్యాప్ కనెక్షన్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. గ్రామాలలో ఒక్క కనక్షన్‌కూడా ఇవ్వని ప్రాంతాలలో ప్రస్తుతం పైపుద్వారా నీటి సరఫరా జరిగే పథకాలను సమీక్షించాల్సిందిగా ఈ సమీక్షా సమావేవశంలో ప్రముఖంగా సూచించారు. ఎస్.సి, ఎస్‌టిలు ఎక్కువమంది గల గ్రామాలు, సంసద్ ఆదర్శ యోజన కింద గల గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాలలో సార్వత్రిక కవరేజ్‌పై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరడం జరిగింది.
జల్ జీవన్ మిషన్ వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత, కమ్యూనిటీ నిర్వహించే కార్యక్రమం. స్థానిక గ్రామీణ ప్రలు, గ్రామపంచాయితీలు, వినియోగ వర్గాలు ఈ కార్యక్రమం అమలు, ప్రణాళిక రూపకల్పన, నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ వంటి వాటిని చూడవలసిఉంటుంది. ఇవి దీర్ఘకాలికంగా సుస్థిరంగా ఉండేట్టు చూడాలి. జల్‌జీవన్ మిషన్‌నుప్రజా ఉద్యమంగా మలచేందుకు ఐఇసి ప్రచారాన్నిచేపట్టవలసిందిగా మిజోరం రాష్ట్రానికి సూచించడం జరిగింది. గ్రామాలలో నీటిసరఫరా మౌలికసదుపాయాల కల్పన, వాటి నిర్వహణ, కార్యకలాపాలు కొనసాగించడానికి మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలను వినియోగించాలి.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ, ట్యాప్ ద్వారా మంచినీటి సరఫరా జరిగేలా చూసేందుకు పూర్తి సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌కింద 79.30 కోట్ల రూపాయలను మిజోరంకు కేటాయించింది. మిజోరంలో జల్ జీవన్ మిషన్ అమలును వేగవంతం చేయాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని కోరడంజరిగింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటులను కోల్పోకుండా ఉండేందుకు కేటాయించిన నిధులను వినియోగించాల్సిందిగా ఆ రాష్ట్రానికి సూచించడం జరిగింది.
దీనికితోడు 15వ ఆర్థిక సంఘం పంచాయతిరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులలో 50 శాతం నిధులను మంచినీటిసరఫరా, పారిశుధ్యంపై ఖర్చు చేయాల్సి ఉంది. మిజోరంకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్ధిక సంఘం నిధుల కింద 93 కోట్లరూపాయలు కేటాయించడం జరిగింది. ఇది తప్పకుండా మంచినీరు, పారిశుధ్యంపై ఖర్చుచేయాలి. దీనితోపాటు రాష్ట్రప్రభుత్వం ఎంఇఎన్ఆర్ ఇజి,జెజెఎం, ఎస్‌బిఎం (జి), జిల్లా మినరల్ డవలప్‌మెంట్‌పండ్, కిఎఎంపిఎ, సిఎస్ార్‌నిధులు, స్థానిక సంస్థల అభివృద్ధఙ నిధుల వంటివాటిని గ్రామ స్థాయి సమగ్ర అభివృద్ధికి జాగ్రత్తగా వినియోగించవలసి ఉంది.
మిజోరంలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలు, పాఠశాలకు పైపుద్వారా మంచినీటి సరఫరాను 2020 అక్టోబర్ 2 నుంచి ప్రారంభించిన 100రోజుల కార్యక్రమంలో భాగంగా అందించాలని కోరడం జరిగింది. దీనివల్ల తాగు నీరు,మధ్యాహ్న భోజనానికి వంటకు, చేతులు శుభ్రపరచుకునేందుకు, టాయిలెట్లకు నీరు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రచారం ద్వారా పబ్లిక్ సంస్థలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కలుగుతుంది.దీనివల్ల పిల్లలు సురక్షిత మంచినీటిని పొందడానికి తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడడానికి వీలు కలుగుతుంది.
****
(Release ID: 1669310)
Visitor Counter : 196