వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎం.ఎస్.పి. వద్ద రికార్డు స్థాయిలో వరి సేకరణ జరుగుతుందని అంచనా - శ్రీ పీయూష్ గోయల్


సరసమైన ధరలో ఉల్లిపాయల సరఫరాకు ప్రభుత్వం క్రియాశీల చర్యలు తీసుకుంటోంది

బంగాళాదుంపల ధరలు పెరగకుండా ప్రభుత్వం కృషి చేస్తోంది

పప్పుధాన్యాల ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

Posted On: 30 OCT 2020 6:17PM by PIB Hyderabad

ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో రికార్డు స్థాయిలో 742 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించడానికి, భారత ఆహార సంస్థ మరియు రాష్ట్ర ఏజెన్సీలు, సిద్ధంగా ఉన్నాయి. కాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థలు 627 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాయి.  అదే విధంగా, 2020-21 ఖరీఫ్ సీజను కోసం విక్రయకేంద్రాల సంఖ్యను కూడా  30,709 నుండి 39,122 కి పెంచడం జరిగింది.  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విలేకరులకు ఈ విషయాలు తెలియజేస్తూ, మార్కెట్లో వరి ముందుగా రావడంతో, వరి సేకరణ ప్రక్రియను కూడా ముందుకు జరిపి 26/09/2020 తేదీన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. 

ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో  వరి సేకరణ అంచనా వివరాలు

snip 3.PNG

snip 2.PNG

ఉల్లిపాయలను సరసమైన ధరలో సరఫరా చేయడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు గురించి కూడా మంత్రి మాట్లాడారు.

ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు - 

ఉల్లిపాయల ఎగుమతిపై 14/09/2020 తేదీ నుండి నిషేధం విధించడం జరిగింది. డి.జి.ఎఫ్.‌టి.  ప్రయివేటు ఏజెన్సీ ల ద్వారా దిగుమతులను చేపడుతోంది. నిత్యావసర వస్తువుల చట్టం కింద, 23/10/2020 తేదీ నుండి,  ఉల్లిపాయల నిల్వ పరిమితిని, టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నుల చొప్పున మరియు చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల చొప్పున విధించడం జరిగింది.

 ఉల్లి గింజల ఎగుమతిని కూడా నిషేధించడం జరిగింది. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, మిగులు నిల్వల నుండి ఉల్లిపాయలను సరఫరా చేయడం జరుగుతోంది.

బంగాళాదుంపల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, శ్రీ పీయూష్ గోయల్, భరోసా ఇచ్చారు. బంగాళాదుంపలపై దిగుమతి సుంకం గతంలో 30 శాతం ఉంది. కాగా, ఇప్పుడు 31/01/2021 తేదీ వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల కోటా వరకు బంగాళాదుంపలపై దిగుమతి సుంకం 10 శాతం విధించనున్నట్లు ప్రకటించడం జరిగింది.

అదేవిధంగా, పప్పుధాన్యాల ధరలను నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. పెసర పప్పు, మినప పప్పు, కందిపప్పు - ఈ మూడు పప్పులను మిగులు నిల్వల నుండి రిటైల్ గా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు.  మిగులు నిల్వ నుండి 2 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పును బహిరంగ మార్కెట్ ద్వారా వచ్చే 15 రోజుల్లో విక్రయించనున్నారు. 

 

*****

 



(Release ID: 1668959) Visitor Counter : 198