వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జాతీయ ఉత్పాదకత మండలికి ఐఎస్ఓ 17020: 2012కు అనుగుణంగా అక్రిడిటేషన్ లభిస్తుంది

Posted On: 29 OCT 2020 4:38PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ, ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క మ‌రియు అంత‌ర్జాతీయ వాణిజ్యపు డిపార్ట్‌మెంట్ ప‌రిధిలోని 'జాతీయ ఉత్పాద‌క మండ‌లి' (ఎన్‌పీసీ).. ఫుడ్ సేఫ్టీ ఆడిట్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల సైంటిఫిక్ స్టోరేజ్ విభాగంలో తనిఖీ, ఆడిట్ పనులను చేపట్టడానికి వీలుగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీ (ఎన్ఏబీసీబీ), క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) చేత ఐఎస్ఓ 17020: 2012కు అనుగుణంగా అక్రిడిటేషన్ మంజూరు చేయబడింది. ఎన్‌పీసీ సంస్థ భార‌త ప్ర‌భుత్వ‌ వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ, ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క, అంత‌ర్జాతీయ వాణిజ్యపు డిపార్ట్‌మెంట్ ప‌రిధిలోని సంస్థ. అక్రిడిటేషన్ మూడేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది. తనిఖీ, ఆడిట్ కార్యకలాపాలు చేపట్టడానికి ఎన్‌పీసీ ఇప్పటికే తన ప్రధాన కార్యాలయంలో తనిఖీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. గిడ్డంగుల అభివృద్ది నియంత్రిత ప్రాధికారిక సంస్థ (డ‌బ్ల్యూడీఆర్ఏ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) వంటి వివిధ చట్టబద్దమైన సంస్థల కోసం ఎన్‌పీసీ తనిఖీలు / ఆడిట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే తనిఖీలు మరియు ఆడిట్‌ల విభాగంలో సంస్థ మేటి విశ్వాస‌నీయత‌ను కలిగి ఉంది. భారత దేశం అంతటా ఫుడ్ స్టోరేజ్/ గిడ్డంగులు / శీతల గిడ్డంగుల‌ పరిశీలనకు డ‌బ్ల్యూడీఆర్ఏ 2011 నుండి ఎన్‌పీసీ సంస్ధ‌ని అక్రిడిటేషన్, ఇన్స్పెక్షన్ ఏజెన్సీగా ఎంపానెల్‌ను చేసింది. ఎన్‌పీసీ సంస్థ డెయిరీ ప్లాంట్‌లు, వంట నూనె వెలికితీత యూనిట్ల‌తో పాటు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్ష‌న్ ప్లాంట్‌లు, ఆయిల్ రిఫైనరీల ఆడిట్‌లు కూడా నిర్వహించింది. ఐఎస్ఓ 17020:2012కు అనుగుణంగా ఎన్ఏబీసీబీ చేత ఎన్‌పీసీ సంస్థ‌కు అందిన‌ ప్రస్తుత అక్రెడిటేషన్‌తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ సేఫ్టీ ఆడిటింగ్) రెగ్యులేషన్స్ - 2018 ప్ర‌కారం ఆహార ప‌దార్థాల నిల్వ గిడ్డంగుల‌తో పాటుగా.. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల కార్య‌క‌లాపాల‌ను డ‌బ్ల్యుడీఆర్ఏ నిబంధనలు- 2017 మేర‌కు స్వతంత్రంగా మూడో పార్టీ ఆడిట్‌ను చేపట్టడానికి.. ఇది దోహ‌దం చేయ‌నుంది.
వైబీ/ ఏపీ
                                 

***(Release ID: 1668715) Visitor Counter : 154