యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఐటిబిపి నిర్వహిస్తున్న 200 కిలోమీటర్ల 'ఫిట్ ఇండియా వాక్‌థాన్'ను ప్రారంభించనున్న కేంద్ర క్రీడా మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, నటుడు విద్యుత్ జమ్వాల్

Posted On: 29 OCT 2020 4:53PM by PIB Hyderabad

కేంద్ర క్రీడా మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు, నటుడు విద్యుత్ జమ్వాల్‌తో కలిసి అక్టోబర్ 31న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 200 కిలోమీటర్ల పొడవైన 'ఫిట్ ఇండియా వాక్‌థాన్'ను ప్రారంభించనున్నారు.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటిబిపి) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 3 రోజులు (అక్టోబర్ 31 నుండి నవంబర్ 2) కొనసాగుతుంది. ఈ వాక్‌థాన్‌లో వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాల (సిఎపిఎఫ్) జవాన్లు మరియు సిబ్బంది పాల్గొని 200 కిలోమీటర్లకు పైగా కవాతు చేస్తారు.

ఈ వాక్‌థాన్ కవాతు పగలు, రాత్రి కూడా కొనసాగుతుంది. భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న థార్ ఎడారిలోని ఇసుక దిబ్బల గుండా కూడా ఈ కవాతు వెళుతుంది.

రాబోయే కార్యక్రమం గురించి శ్రీ కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.."ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని  ప్రధాని పిలుపు నిచ్చారని చెప్పారు. ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి..మన జవాన్లు ఈ ప్రత్యేకమైన వాక్‌థాన్‌ చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. జైసల్మేర్‌ జవాన్లతో కలిసి ఈ వాక్‌లో పాల్గొంటానని తెలిపారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడమే క్రీడా మంత్రిత్వ శాఖ యొక్క ముఖ్య ప్రయత్నం"అని చెప్పారు.

క్రీడామంత్రి ఆలోచనలతో బాలీవుడ్ నటుడు మరియు ఫిట్‌నెస్‌ ఐకాన్ విద్యామ్ జమ్వాల్ ఏకీభవించారు. "ఫిట్ ఇండియా వాకథాన్ ద్వారా ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా చెప్పడం పట్ల తనకు ఆనందంగా ఉందన్నారు. శ్రీ కిరణ్ రిజిజుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండడం మరియు ఫిట్‌నెస్ గురించి జవాన్లు చేసే ప్రచారంలో తాను కూడా పాల్గొనుడడం తనకు గర్వకారణంగా ఉందని చెప్పారు.

'ఫిట్ ఇండియా వాక్‌థాన్' ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముగిసిన 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్' భారతదేశంలోని 6.5 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు.

***



(Release ID: 1668699) Visitor Counter : 87