విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల‌లో విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వాన్ని ప్రారంభించిన ఎన్‌టీపీసీ

Posted On: 29 OCT 2020 3:35PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు, ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన 'నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పోరేష‌న్ లిమిటెడ్' (ఎన్‌టీపీసీ).. విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్సవంను (అక్టోబర్ 27 నుండి నవంబర్ 2, 2020 వరకు..) ప్రారంభించింది. “విజిలెంట్ భార‌తం.. సంపన్న భారతదేశం” అని ప్రతిజ్ఞతో దీనిని చేప‌ట్టారు. ఎన్‌టీపీసీకి చెందిన అన్ని విద్యుత్తు ఉత్ప‌త్తి కేంద్రాల‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వ‌హిస్తున్నారు. జీవితంలోని అన్ని రంగాలలో త‌గు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి, అవినీతిని అరికట్టడానికి గాను త‌గు అవగాహన కల్పించేందుకు గాను.. కోవిడ్-19 సమయంలో అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ ఎన్‌టీపీసీ సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రతిజ్ఞ తీసుకోవడంతో విజిలెన్స్ అవ‌గాహ‌న‌పు వారోత్స‌వం ప్రారంభమైంది. దీర్ఘదృష్టితో ముందుకు న‌డుస్తూ, విలువతో కూడిన సంస్థగా నీతితో రాణించేందుకు ఎన్‌టీపీసీ ఎల్ల‌వేళ‌ల ప్రయ‌త్నిస్తుంది. స్వావలంబన భారతాన్ని నిర్మించాలన్న తన నిబద్ధతను  విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వం ద్వారా ఎన్‌టీపీసీ మరోసారి పునరుద్ఘాటించింది. ఈ ప్రక్రియలో భాగంగా సంస్థ త‌న చర్యలు అప్రమత్తంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు గాను మ‌రింత‌గా కట్టుబడి ఉంది. ఎన్‌టీపీసీ విజిలెన్స్ విభాగం సంస్థ యొక్క అన్ని ప్రక్రియలతో దాని పనితీరును సమన్వయం చేయడంలో త‌న‌ హృదయపూర్వక ప్రయత్నాలను చేపట్టడానికి కృషి చేసింది. ప‌లు సినిమాలు, రేడియో జింగిల్స్, సోషల్ మీడియా మెసేజింగ్‌ ప్రదర్శించబడుతున్నాయి. వీటితో సందేశాలను ప్రజలకు పెద్దగా ప్రచారం చేయ‌డానికి గాను కృషి చేయ‌డ‌మైంది. విజిలెన్స్‌పై అవగాహన పెంచడానికి, ఎన్‌టీపీసీ వారి ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం క్విజ్, ఎలోక్యూషన్, ఎస్సే మరియు చిత్ర‌లేఖ‌నం పోటీలు వంటి వివిధ ఉద్యోగుల ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మాల‌ను చేపట్టనుంది. ఈ అంశంపై అవగాహన పెంచడానికి వివిధ సామాజిక ప్రచారాలు కూడా ప్రారంభించ‌నున్నారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ ప్రాముఖ్యతపై బాహ్య మరియు అంతర్గత భాగ‌స్వామ్య ప‌క్షాల వారికి అవగాహన కల్పించడానికి గాను ఎన్‌టీపీసీ పవర్ స్టేషన్లలో బ్యానర్లు మరియు పోస్టర్లు ప్రదర్శించబడతాయి.

***



(Release ID: 1668537) Visitor Counter : 121