విద్యుత్తు మంత్రిత్వ శాఖ

జ‌పాన్ ప్ర‌భుత్వ జెపివై కొర‌కు ఉద్దేశించిన ఆర్ధిక సంస్థతో హ‌రిత చొర‌వ కోసం 50 బిలియ‌న్ల విదేశీ ద్ర‌వ్య రుణ ఒప్పందాన్ని చేసుకున్న ఎన్‌టిపిసి లిమిటెడ్ ఫ్లూగ్యాస్ డిస‌ల్ఫ‌రైజేష‌న్ (ఎఫ్‌జిడి)‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టుల‌కు మూల ధ‌న వ్య‌యానికి ఈ రుణం ద్వారా వ‌చ్చే ఆదాయ‌న్ని ఉప‌యోగించ‌నున్న ఎన్‌టిపిసి

Posted On: 28 OCT 2020 4:53PM by PIB Hyderabad

భార‌త్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్ప‌త్తిదారు అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్ బుధ‌వారం నాడు జ‌పాన్ ప్ర‌భుత్వ ఆర్ధిక సంస్థతో 50 బిలియ‌న్ల (సుమారు 482 మిలియ‌న్ డాలర్లు లేదా రూ. 3,582 కోట్లు) మేర‌కు విదేశీ ద్ర‌వ్య రుణ ఒప్పందాన్ని చేసుకుంది.  జ‌పాన్ బ్యాంకు ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ కోఆప‌రేష‌న్ (జెబిఐసి)   గ్రీన్ (హ‌రిత‌) లేక ఆర్ధిక వృద్ధి స‌మ‌న్వ‌యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ చొర‌వ కింద ఎన్‌టిపిసి లిమిటెడ్ తొలి నిధుల‌ను అందుకోనుంది. జెబిఐసి 60% సుల‌భ మొత్తాన్ని అందిస్తుండ‌గా, మిగిలిన మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు (సుమిటోమో మిట్సు బ్యాంకింగ్ కార్పొరేష‌న్‌, ది బ్యాంక్ ఆఫ్ యోకోహామా లిమిటెడ్‌, ది శాన్‌-ఇన్ గోడో బ్యాంక్ లిమిటెడ్‌, ది జోయో బ్యాంక్ లిమిటెడ్‌, ది నాంటో బ్యాంక్ లిమిటెడ్) జెబిఐసి గ్యారెంటీ కింద అంద‌చేస్తాయి. గ్లోబ‌ల్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణలో భాగంగా చేప‌ట్టే ప్రాజెక్టుల‌కు  జెబిఐసి చేయూత సౌక‌ర్యాన్ని విస్త‌రించారు. ఈ రుణ ఆదాయాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్ వినియోగిస్తుంది. ఫ్లూగ్యాస్ డిస‌ల్ఫ‌రైజేష‌న్ (ఎఫ్‌జిడి)‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టుల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి మూల‌ధ‌న వ్య‌యాన్ని వెచ్చిస్తుంది. థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌లో విడుద‌ల‌య్యే  ఫ్లూ వాయువుల‌లోని ఎస్ఒఎక్్స‌విడుద‌ల‌ను చెప్పుకోద‌గ్గ రీతిలో ఎఫ్‌జిడి త‌గ్గిస్తుంది. ఇది ప‌ర్యావ‌ర‌ణ మ‌నుగ‌డ‌లో కీల‌క అడుగు. 

 


ఈ రుణ ఒప్పందంపై ఎన్‌టిపిసి డైరెక్ట‌ర్ (ఫైనాన్స్‌) అనిల్ కుమార్ గౌత‌మ్‌, ఇన్‌‌‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ & ఎన్విరాన్‌మెంట్ ఫైనాన్స్ గ్రూప్ అయిన జెబిఐసి అంత‌ర్జాతీయ అధిప‌తి, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ట‌నిమోటో మ‌స‌యుకి వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా సంత‌కాలు చేశారు. 

***
 


(Release ID: 1668275) Visitor Counter : 230