సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

నిఘా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఐసీ

प्रविष्टि तिथि: 28 OCT 2020 5:30PM by PIB Hyderabad

నిఘా అవగాహన వారోత్సవాల్లో భాగంగా, జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) సీఎండీ శ్రీ విజయేంద్ర, సంస్థ సిబ్బందితో "సంస్థల కోసం సమగ్రత ప్రతిజ్ఞ" చేయించారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఐసీ పని చేస్తుంది.

    ఎన్‌ఎస్ఐసీ డైరెక్టర్లు ఉదయకుమార్‌, గౌరంగ్‌ దీక్షిత్‌, సీవోవీ రాజన్‌ తెహ్రాన్‌, సంస్థ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా జీవితంలో సమగ్రత, నిజాయతీని పెంపొందించేందుకు కట్టుబడిన ఎన్‌ఎస్‌ఐసీ నిబద్ధతను ఈ వారోత్సవాలు చాటుతాయి. ఉద్యోగులంతా కొవిడ్‌ నివారణ మార్గదర్శకాలు పాటించాలని సంస్థ సీఎండీ సూచించారు. ఈ ఏడాది నిఘా అవగాహన వారోత్సవాల్లో భాగంగా ప్రచార రూపంలో చేపట్టాల్సిన అంశాలపైనా దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు, "సతర్క్‌ భారత్‌- సమృద్ధ్‌ భారత్‌" అంశంతో ఎన్‌ఎస్‌ఐసీ ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది. 

***


(रिलीज़ आईडी: 1668255) आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Tamil