రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రూ.174.44 కోట్ల తుది డివిడెండ్‌ చెక్కును రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌కు అందించిన 'భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌'

Posted On: 28 OCT 2020 3:42PM by PIB Hyderabad

'భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌'లో రాష్ట్రపతి పేరిట ఉన్న వాటాలపై 140 శాతం తుది డివిడెండ్‌గా రూ.174,43,63,569.20/-ను ఆ సంస్థ చెల్లించింది. ఆ మొత్తం విలువకు సమానమైన చెక్కును రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌కు, బీఈఎల్‌ సీఎండీ శ్రీ గౌతమ అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 140 శాతం మధ్యంతర డివిడెండ్‌ను (ఒక్కో వాటా ముఖ విలువ ఒక్క రూపాయి) ప్రభుత్వానికి బీఈఎల్‌ చెల్లించింది. 

    రక్షణ రంగ సంస్థగా బీఈఎల్‌కు నవరత్న హోదా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 280 శాతం డివిడెండ్‌ను ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది. 

    రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శి శ్రీ రాజ్‌కుమార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1668216) Visitor Counter : 176