రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రైతుల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు 27500 మెట్రిక్ ట‌న్నుల ఎంఒపి ఎరువును టూటికార్న్‌లో 3వ ద‌శ స‌రుకు దిగుమ‌తిలో భాగంగా అందుకున్న‌ ఫ్యాక్ట్

Posted On: 28 OCT 2020 1:46PM by PIB Hyderabad

మూడ‌వ మ్యురియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి) దిగుమ‌తి ఓడ‌ సోమ‌వారంనాడు టూటికార్న్ పోర్టులో దిగింది. ది ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమికెల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) ఈ ఉత్ప‌త్తిని దిగుమ‌తి చేసుకుంది. దాదాపు 27500 మెట్రిక్ ట‌న్నుల ఉత్ప‌త్తిని పొందే ప్ర‌క్రియ సాగుతోంది. 

 


ఈ స‌రుకు దిగుమ‌తితో ఈ ఏడాది దిగుమ‌తులు 82000 మెట్రిక్ ట‌న్నుల ఎంఒపిని దిగుమ‌తి చేసుకున్న‌ట్టు అయింది. ర‌సాయినాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్యాక్ట్ మూడు ద‌శ‌ల్లో దిగుమ‌తి కోసం ఆర్డ‌ర్‌ను పెట్టింది. 
ఎంఒపితో క‌లిసి ఫ్యాక్ట్ ప్ర‌ధాన ఉత్ప‌త్తి అయిన ఫ్యాక్టంఫోస్ (ఎన్‌పి 20ః20ః0ః13)కు ద‌క్షిణ భార‌త రైతులు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తారు.
ఈ ఏడాదిలో మ‌రో రెండు విడ‌త‌లుగా ఎరువును తెప్పించేందుకు కంపెనీ యోచిస్తోంది.  
ఖ‌రీఫ్ కాలంలో రైతుల డిమాండ్‌ను తీర్చ‌డానికి ఇంత‌కు ముందు కంపెనీ రెండు ద‌ఫాలుగా ఎంఒపిని, ఒక పార్సెల్ ఎన్‌పికె (16ః16ః16)ను దిగుమ‌తి చేసుకుంది. 
దేశంలోనే అతిపెద్ద ఎరువుల ఉత్ప‌త్తిదారు అయిన ఫ్యాక్ట్, ఈ ఏడాది ఎరువుల ఉత్ప‌త్తి, మార్కెటింగ్‌ల‌లో చ‌క్కటి ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది. 

***


(Release ID: 1668122) Visitor Counter : 200