రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

న్యూ ఢిల్లీలో భారత్, అమెరికా దేశాల మధ్య మంత్రుల స్థాయిలో 27 అక్టోబర్ 2020న 2+2 సమావేశం తరువాత భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన

Posted On: 27 OCT 2020 4:30PM by PIB Hyderabad

 

అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో,  రక్షణ మంత్రి ఎస్పర్,  భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్,  మహిళామణులు మరియు సజ్జనులారా ...

కోవిద్ --19 విశ్వ మహమ్మారి ముప్పు పొంచి ఉన్నప్పటికీ మాతో సమావేశం కావడానికి భారత్ కు ప్రయాణించి వచ్చిన మంత్రులకు, వారి ప్రతినిధివర్గాలకు, అమెరికా మీడియా ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు.   ద్వైపాక్షిక సంబంధాల పట్ల మీకు గల కట్టుబాటును నేను ప్రశంసిస్తున్నాను.  


ఈ రోజు జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక,  బహువిధ సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై మేము సమగ్ర చర్చలు జరిపాము.  మాకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళను గురించి మేము యోచించాము.   మా చర్చలలో సహజంగానే  ఆర్ధిక వ్యవస్థ సత్వరం కోలుకోవలసిన ఆవశ్యకత,  మహమ్మారి నిరోధం ,  ప్రపంచ సరఫరా రంగం పునర్నిర్మాణం మరియు సంబంధిత సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.  

నేను  డాక్టర్ ఎస్పర్ తో రక్షణ సంబంధిత అంశాలపై సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిపాను. ఈ రోజు మంగళవారం మా చర్చలను ప్రాంతీయ మరియు దృష్టికోణంలో విస్తృతంగా 2+2 స్థాయిలో కొనసాగించాం.  

2016లో  వ్యూహరచనకు సంబంధించిన  లేమో ఒప్పందం  మరియు 2018లో  ప్రసార సౌకర్యాల సాంగత్యం మరియు భద్రతకు సంబంధించిన కోమ్కాసా ఒప్పందాల  తరువాత ఇప్పుడు భౌగోళిక -  అంతరిక్ష సహకారం కోసం బేసిక్ ఎక్స్చేంజి అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్  'బెకా' పై సంతకాలు చేయడం చాలా ముఖ్యమైన పరిణామం.  

గతంలో జరిపిన చర్చల నేపథ్యంలో వాటి కొనసాగింపుగా  ఇండియా , అమెరికా రెండూ తీసుకున్న గమనార్హమైన చర్యలను నేను ప్రముఖంగా చెప్పదలిచాను.  వాటిలో  అమెరికా సెంట్రల్ కమాండ్ మరియు ఆఫ్రికా కమాండ్ తో మరింత సమన్వయం కోసం హిందూ మహా సముద్రప్రాంతంలో అమెరికా నౌకాదళ అనుసంధాయకాధికారి  మరియు  బహ్రెయిన్ లో అమెరికా నౌకాదళ సెంట్రల్ కమాండ్ వద్ద భారత నౌకాదళ అనుసంధాయకాధికారిని నియమించడం వంటివి ఉన్నాయి.  ఈ విధంగా పరస్పరం అనుసంధాయకాధికారులను నియమయించడం వల్ల ఇరుదేశాల సైన్యాల మధ్య సహకారం మరింత పురోగమిస్తుంది.  

సామర్ధ్యం పెంపుతో పాటు మా పొరుగున ఉన్న  మరియు దూరంగా ఉన్న మూడవ దేశంలో ఉమ్మడి సహకారంతో కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలను ఈ రోజు జరిగిన సమావేశంలో అన్వేషించాము.  ఇటువంటి  అనేక  ప్రతిపాదనలపై అభిప్రాయాలలో ఏకత్వం ఉంది.  దీనిని మరింత ముందుకు తీసుకెళతాము.  

సముద్ర తీర అవగాహనకు సంబంధించిన అంశాలలో సహకారం అందించాలన్న మా అభ్యర్థనకు అంగీకారం తెలుపడాన్ని నేను స్వాగతిస్తున్నాను.  అవసరమైన వ్యవస్థలు మరియు ప్రావీణ్యం ఉమ్మడి అభివృద్ధికి  చేపట్టవలసిన ప్రక్రియలను ప్రారంభించడానికి పూర్తి చేయవలసిన పనులపై ఉభయపక్షాలు అంగీకారానికి వచ్చాయి.  

రక్షణ పారిశ్రామిక సహకారంలో పక్షపాతరహిత మరియు ఉపయుక్తమైన చర్చలు జరిగాయి.  రక్షణ రంగంలో స్వయంసమృద్ధి కోసం ఇటీవల కాలంలో ఇండియా చేస్తున్న ప్రయత్నాలు మా రక్షణ పారిశ్రామిక సహకారానికి మార్గదర్శకంగా ఉన్నాయి.  భారత రక్షణ పరిశ్రమ సామర్ధ్యం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను.  రక్షణ పరిశోధనాభివృద్ది రంగంలో కలసి పని చేయాలని తీర్మానించాము.

ఇటీవల కాలంలో రక్షణ రంగంలో వినూత్నత గురించి రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో  సంగతమైన చర్చలు జరుగుతున్నాయి.  గత రెండు సమావేశాలలో కుదిరిన ఒప్పందాల ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి.  గత జూలైలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ఐడెక్స్ - డి ఐ యు ప్రారంభ సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతించాము.  ఈ ఏడాది ఐ ఎస్ ఏ శిఖరాగ్ర సమ్మేళనం కోసం ఎదురుచూస్తున్నాం.  

మా సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి అంచనాపై అభిప్రాయలు పంచుకున్నాం.  తద్వారా శాంతికి కట్టుబడి ఉండాలన్న మా కృతనిశ్చయాన్ని పునరుద్ఘాటించాం.  అంతర్జాతీయ వ్యవస్థ, న్యాయపాలన,  అంతర్జాతీయ సముద్ర జలాలలో నౌకాయానం చేసే స్వేచ్ఛ మరియు ప్రాదేశిక సమగ్రత,  అన్ని రాజ్యాల  సార్వభౌమాధికారం కాపాడటంపై ఆధారపడిన నియమాలను సంరక్షించాలని కూడా మేము అంగీకరించాము.  కాగా మలబార్ విన్యాసాలలో పాల్గొనాలన్న ఆస్ట్రేలియా నిర్ణయాన్ని ఉభయపక్షాలు స్వాగతించాయి.  

అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో,  రక్షణ మంత్రి ఎస్పర్ భారత పర్యటనకు రావడాన్ని మేము ప్రశంసిస్తున్నాము.  ఈ రెండు రోజుల్లో  మా మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.  రక్షణ రంగంలో భద్రతా  అంశాలు మరియు ఇతర విషయాలలో కుదిరిన ఒప్పందాలను మరింత పటిష్టం చేయడానికి సంబంధించి  కలసి పనిచేయదాన్ని మేము కొనసాగిస్తాము.

***



(Release ID: 1667990) Visitor Counter : 219