జల శక్తి మంత్రిత్వ శాఖ

మేఘాలయలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం మిడ్ టర్మ్ రివ్యూ

పోస్ట్ చేసిన తేదీ: 26 అక్టోబరు 2020 6:05 పీఎం పీఐబీ ఢిల్లీ

మేఘాలయలో జల్ జీవన్ మిషన్ ప్రణాళిక అమలుపై మధ్యంతర సమీక్ష సమావేశం

వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహణ

జాతీయ జల్ జీవన్ మిషన్ పురోగతిని వివరించిన రాష్ట్ర అధికారులు

Posted On: 26 OCT 2020 6:05PM by PIB Hyderabad

మేఘాలయలో సుమారు 5.89 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి  2020-21లో 2.04 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించాలని రాష్ట్రం యోచిస్తోంది. రాష్ట్రంలోని 1,636 గ్రామాలన్నింటికీ 2020-21లో వందశాతం కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు మధ్యంతర సమీక్షలో గుర్తించారు. ఇప్పటివరకు, 112 గ్రామాలకు కుళాయి సదుపాయం కల్పించారు. ఆశిస్తున్న జిల్లాలకు,  సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.

ప్రతి గ్రామానికి గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వీఏపీ) సిద్ధం చేయడం ద్వారా గ్రామ స్థాయిలో ప్రణాళికపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని రాష్ట్రానికి సూచనలు ఇచ్చారు.  ఈ ప్రణాళికలో తాగునీటి వనరులను బలోపేతం చేయడం, నీటి సరఫరా మౌలిక సదుపాయాలు, మురుగు నీటి నిర్వహణ  ఆపరేషన్ & నిర్వహణ వంటివి ఉండాలి. తాగునీటి సరఫరా వ్యవస్థల  దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఇప్పటికే ఉన్న తాగునీటి వనరుల విస్తరణను దృష్టిలో పెట్టుకోవాలి. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జల్ జీవన్ మిషన్, ఎస్‌బిఎం (జి), గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఎఫ్‌సి గ్రాంట్లు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, కాంపా, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ తదితర కార్యక్రమాలను గ్రామస్థాయిలో విలీనం చేయాలని కోరారు. ఈ నిధులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి గ్రామ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కోరారు. స్థానికులను సమీకరించడానికి ఐఈసీ  ప్రచారాన్ని ప్రారంభించాలని రాష్ట్రం కోరింది.

 

జల్ జీవన్ మిషన్ కింద, 2020-21 మధ్యకాలంలో, మేఘాలయకు ₹ 114.09 కోట్లు కేటాయించారు. వీటిలో 28.52 కోట్ల రూపాయలను రాష్ట్రానికి విడుదల చేశారు.  2020-21లో, మేఘాలయకు 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్లుగా రూ. 182 కోట్లు కేటాయించారు.  ఈ మొత్తంలో 50 శాతాన్ని తప్పనిసరిగా నీటి సరఫరా,  పారిశుద్ధ్యానికి ఉపయోగించాలి. జల్ జీవన్ మిషన్లో భాగంగా స్థానికులు, ముఖ్యమైన అధికారులు నీటి నాణ్యతకు ప్రాముఖ్యం ఇస్తారు. నీటి నాణ్యతను పరీక్షించే ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఉపయోగించడానికి ప్రతి గ్రామంలో 5 మందికి... ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి వనరును భౌతిక,  రసాయన పారామితుల కోసం ఏడాదికి ఒకసారి , కలుషిత బ్యాక్టరియా కోసం రెండుసార్లు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వచ్చే 3-4 నెలల్లో రాష్ట్ర,  జిల్లా ప్రయోగశాలల  ఎన్ఎబిఎల్ అక్రిడిటేషన్‌ను పూర్తి చేసి  వాటిని ప్రజల కోసం తెరవాలని సూచించారు. సరఫరా అవుతున్న నీటి నాణ్యతను వీటి ద్వారా నామమాత్రపు రేటుతో పరీక్షించవచ్చు. 2020 అక్టోబర్ 2 న ప్రారంభించిన ప్రత్యేక 100 రోజుల ప్రచారంలో భాగంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు,  పాఠశాలలకు పైపుల ద్వారా నీటి సరఫరా ఉండేలా చూడాలని రాష్ట్రాన్ని కోరారు. తద్వారా తాగుడానికి, చేతులు కడుక్కోవడానికి,  మరుగుదొడ్లలో వాడకానికి మంచినీరు అందుబాటులో ఉంటుంది.

2024 నాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా గ్రామీణ గృహాలకు త్రాగునీటిని అందించడానికి చేపట్టిన కీలకమైన కార్యక్రమం జల్ జీవన్ మిషన్. కుళాయి నీటి ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం.

***


(Release ID: 1667694) Visitor Counter : 144