కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ లో నిర్మించనున్న 100 పడకల నూతన ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన - శ్రీ గంగ్వార్

పవిత్రమైన దసరా రోజున బరేలీ ప్రాంత ప్రజలందరికీ సంతోషాన్నీ, ఆనందాన్నిఇవ్వనున్న - ప్రతిపాదిత కొత్త ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి

Posted On: 26 OCT 2020 4:22PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ లో నిర్మించనున్న 100 పడకల నూతన ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి భవనానికి, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి (ఐ/సి) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, నిన్న భూమి పూజ చేశారు. 
 
 
బరేలీ నుండి ఎనిమిదోసారి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ గంగ్వార్,  ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజల వైద్య అవసరాల యొక్క కలను సాకారం చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, జిల్లా పాలనా యంత్రాంగం చేసిన కృషిని ప్రశంసించారు.  ఈ ఆసుపత్రి ఇప్పుడు ఐ.పి.లు మరియు లబ్ధిదారుల ఇబ్బందులను తగ్గిస్తుందనీ, అంతకు ముందు వారు ఆధునిక వైద్య చికిత్స కోసం  ఢిల్లీ లేదా లక్నో లలోని ఎయిమ్స్ కు వెళ్ళవలసి వచ్చేదనీ చెప్పారు.  నామమాత్రపు వినియోగదారు రుసుము వసూలు చేయడం ద్వారా ఈ ఇ.ఎస్.‌ఐ.సి. ఆసుపత్రి సదుపాయాలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.  భవిష్యత్తులో ఈ ఆసుపత్రిని నమూనా ఆసుపత్రిగా మార్చనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. 
 
 
 
ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన ఇతర ప్రముఖుల్లో - ఉత్తరప్రదేశ్ లోని బరేలీ మేయర్, డాక్టర్ ఉమేష్ గౌతమ్ఉత్తరప్రదేశ్ లోని బరేలీ శాసనసభ్యుడు, డా. అరుణ్‌కుమార్;  మిర్ గంజ్ శాశనసభ్యుడు, డా. డి. సి. వర్మ; బరేలీ,  కమీషనర్, శ్రీ రణ్వీర్ ప్రసాద్ ఐ.ఏ.ఎస్.; డి.ఎం., శ్రీ నితీష్ కుమార్, ఐ. ఏ.ఎస్.; ఇ.ఎస్.ఐ. కార్పొరేషన్, సభ్యుడు, డా. కేశవ్ అగర్వాల్; కార్పొరేటర్. శ్రీమతి ఉషా ఉపాధ్యాయ మొదలైనవారు ఉన్నారు.  బరేలీ ప్రాంతంలోని కార్మికులు మరియు ఇతర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి చేసిన కృషికి వక్తలందరూ కృతజ్ఞతలు తెలిపారు.  అంతకుముందు, మెడికల్ కమిషనర్ డాక్టర్ ఆర్. కె. కటారియా, ప్రముఖులందిరికీ స్వాగతం పలికారు. భారతదేశ వ్యాప్తంగా పనిచేసే కార్మికుల కోసం ‘అటల్ బిమిట్ వ్యక్తి కళ్యాణ్ యోజన’ కింద అందుబాటులోకి తెచ్చిన విస్తృత ప్రయోజనాల కోసం ఇ.ఎస్.ఐ.సి. చేపట్టిన ఇటీవలి చర్యలను ఆయన వివరించారు
 
 
 
ఈ ఆసుపత్రి ని 4.67 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.  బరేలీ మరియు సమీప ప్రాంతాలలోని దాదాపు రెండు లక్షల ఈ.ఎస్.ఐ. లబ్ధిదారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసుపత్రిలో, మైనర్ ఓ.టి., ప్రత్యేక సదుపాయాల గది, అత్యవసర చికిత్స వార్డు, సి.ఎం.ఓ. గది, ఫ్రాక్చర్ క్లినిక్, ఎక్స్-రే, ఈ.సి.జి., నమూనా సేకరణ, రేడియాలజీ, ఓ.టి. లు / ఐ.సి.యూ. లు, వార్డులు వంటి అనేక అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.   
 
 
 
కార్మికుల రాజ్య బీమా సంస్థ అనేది ఒక మార్గదర్శక సామాజిక భద్రతా సంస్థ. విధి నిర్వహణలో గాయం, అనారోగ్యం, మరణం వంటి అత్యవసర సమయాల్లో ఇది సహేతుకమైన వైద్య సంరక్షణ, నగదు ప్రయోజనాల వంటి సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాల శ్రేణిని ఇది అందిస్తుంది.   10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేసే ప్రాంగణాలకు / ఆవరణలకు / సంస్థలకు, ఈ.ఎస్.ఐ. చట్టం వర్తిస్తుంది.  నెలకు 21,000/- రూపాయల వరకు వేతనాలు తీసుకునే ఉద్యోగులకు ఈ.ఎస్.ఐ. చట్టం ప్రకారం ఆరోగ్య బీమా రక్షణ మరియు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.  ఈ రోజున, ఇది సుమారు 3.49 కోట్ల మంది కార్మిక కుటుంబాలకు చెందిన సుమారు 13.56 కోట్ల మంది లబ్ధిదారులకు సాటిలేని నగదు ప్రయోజనాలతో పాటు సహేతుకమైన వైద్య సంరక్షణను అందిస్తోంది.  1952 లో, కార్పొరేషన్‌కు కేవలం 21 డిస్పెన్సరీలు మాత్రమే ఉన్నాయి, ఇ.ఎస్.‌ఐ. ఆసుపత్రులు లేవు.  1648 డిస్పెన్సరీలు / ఆయుష్ యూనిట్లు మరియు 159 ఇ.ఎస్.ఐ . ఆసుపత్రులు, 793 బ్రాంచీ లు  / చెల్లింపు కార్యాలయాలు, 43 డిస్పెన్సరీలతో కూడిన శాఖా కార్యాలయాలు, 64 ప్రాంతీయ మరియు ఉప ప్రాంతీయ కార్యాలయాలతో, ఈ.ఎస్.ఐ.సి. మౌలిక సదుపాయాలు, ఈ రోజున అనేక రేట్లు పెరిగాయి.   దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 566 జిల్లాల్లో ఇ.ఎస్.‌ఐ. పథకం అమలులో ఉంది.

 

*****

 



(Release ID: 1667669) Visitor Counter : 111