రాష్ట్రపతి సచివాలయం
దసరా పర్వదిన సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
24 OCT 2020 6:50PM by PIB Hyderabad
దసరా పర్వదిన సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన ఒక సందేశంలో తెలియజేశారు.
దసరా పండగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండగను దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిర్వహించుకుంటారని అన్నారు. దసరా పర్వదినం దేశ సాంస్కృతిక ఐకమత్యాన్ని బలోపేతం చేస్తుందని, దేశ ప్రజలు సామరస్యంగా జీవించడానికిగాను స్ఫూర్తినిస్తుందని, మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి, చెడును పక్కన పెట్టడానికి దారి చూపుతుందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
మర్యాద పురుషోత్తమునిగా కీర్తి గడించిన శ్రీ రాములవారి జీవితాన్ని, ఆయన మనకు బోధించిన విలువల్ని ఈ దసరా పండగ గుర్తుచేస్తుందని అన్నారు. నైతిక విలువలకు, రుజువర్తనకు ఆయన జీవితం ఉజ్వలమైన నిదర్శనమని రాష్ట్రపతి అన్నారు.
ఈ పండగ దేశ ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని, ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని దేశ ప్రజలకు శాంతి సౌభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నట్టు రాష్ట్రపతి తన సందేశంలో ఆకాంక్షించారు.
***
(Release ID: 1667434)
Visitor Counter : 161