ఉప రాష్ట్రపతి సచివాలయం
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి దసరాపర్వదిన శుభాకాంక్షలు
దసరా సంబరాల సందర్భంగా కోవిడ్-19 ఆరోగ్య నియమ నిబంధనల్నిపాటించాలని ప్రజలకు ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి
Posted On:
24 OCT 2020 5:39PM by PIB Hyderabad
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదిన సంబరాలు చేసుకుంటూనే అదే సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 ఆరోగ్య నియమ నిబంధనల్ని తప్పకుండా పాటించాలని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.
ఉపరాష్ట్రపతి సందేశం:
దసరా పర్వదిన సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలను జరుపుకంటాం. మహిషాసుర రాక్షసున్ని దుర్గామాత అంతమొందించిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ వేడుకలను నిర్వహించుకుంటాం. ఒక ఆదర్శవంతమైన కుమారునిగా, ఆదర్శవంతమైన భర్తగా,ఆదర్శవంతమైన చక్రవర్తిగా భగవాన్ రాములవారు గడిపిన మహోన్నతమైన జీవితం మనకు ఎంతగానో ఆదర్శనీయం. ఆయన జీవితం రుజువర్తనకు, సత్యానికి, ఉన్నత విలువలకు ప్రతిరూపం.
ఈ దసరా ఉత్సవాల సందర్భంగా మనం పలు సంబరాలు జరుపుకుంటాం. దుర్గాపూజ, ఆయుధ పూజ, శమీ పూజ, గౌరి పూజ, రావణుని దిష్టిబొమ్మ దగ్ధం, బతుకమ్మ, సిరిమాను ఉత్సవం..ఇలా అనేక సంబరాలు జరుపుకుంటాం.
కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మెలిసి ఈ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సారి కోవిడ్ -19 మహమ్మారి కారణంగా.... దసరా ఉత్సవాలను నిర్వహించుకునే సమయంలో అన్ని రకాల కోవిడ్ -19 ఆరోగ్య నియమ నిబంధనల్ని పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ ప్రజలందరికీ ఈ పర్వదినం శాంతిని, సామరస్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని, సంపదలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
***
(Release ID: 1667433)
Visitor Counter : 162