జల శక్తి మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల సాకార దిశలో జమ్మూ కాశ్మీర్

100 రోజులలోగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా నీరు సరఫరా

జాతీయ లక్ష్యం 2023-24 జమ్మూలో 2022 డిసెంబర్ నాటికి ముందుగానే లక్ష్య సాధన

Posted On: 24 OCT 2020 11:57AM by PIB Hyderabad

దేశంలో పాఠశాలల విద్యార్ధులందరికి 2023-24 నాటికి సురక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆశయాన్ని లక్ష్యం కంటే ముందుగానే అమలు చేయడానికి జమ్మూకాశ్మీర్ ప్రభత్వం సిద్ధమవుతున్నది. దేశ భవిషత్తును నిర్ణయించే విద్యార్థులకు సురక్షితమైన మంచి నీరును అందించి వారు ఆరోగ్యపరంగా అభివృద్ధి సాదించడానికి వీలు కల్పించడానికి కేంద్రప్రభుత్వం జలజీవన్ మిషన్ పధకాన్ని ప్రారంభించింది. పధకాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం 2020 అక్టోబర్ రెండవ తేదీన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 100 రోజుల పాటు సాగనున్నది . ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించిన విధంగా దేశంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సురక్షితమైన మంచి నీటిని ఈ పధకం కింద సరఫరా చేస్తారు. జలజీవన్ మిషన్ పధకం అమలు జరుగుతున్న తీరును సమీక్షించడానికి కేంద్ర జలశక్తి శాఖ కేంద్రపాలిత ప్రాంతాలు , రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు జమ్మూకాశ్మీర్ పాల్గొని పధకాన్ని అమలు చేయడానికి అమలు చేస్తున్న చర్యలను వివరించింది.

జమ్మూకాశ్మీర్లో 18. 17 లక్షల గృహాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8.38 లక్షల గృహాలకు (46%) పైపులు ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతున్నది. జలజీవన్ మిషన్ ను అమలు చేయడానికి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 681.77 కోట్ల రూపాయలను కేటాయించారు. పధకాన్ని సక్రమంగా అమలు చేయడం మరియు వాస్తవ పని తీరు ఆధారంగా అదనపు నిధులను పొందడానికి వీలుంటుంది. దేశంలో 2023-24 నాటికి పధకాన్నిపూర్తిగా అమలుచేయాలని కేంద్ర లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే, జమ్మూకాశ్మీర్లో పధకాన్ని 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుని దీనికోసం చర్యలను అమలు చేస్తున్నారు. జాతీయ లక్ష్యం కంటే ముందుగానే అమలు చేసి ఇతర రాష్ట్రాలకు జమ్మూకాశీర్ ఆదర్శంగా నిలుస్తుంది. పధకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం జమ్మూకాశ్మీర్ 4,038 గ్రామాల కోసం కార్యాచరణ పధకాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా నీరు లభించే ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తారు. నీరు సక్రమంగా ప్రతి ఇంటికి అవసరాల మేరకు అందేలా చూడడానికి, నీటి వృధా కాకుండా చూడడానికి, భూగర్భ జల మట్టాలు పెరిగేలా చూడడానికి గ్రామా / గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుంది. దీనికి అవసరమైన నిధులను ఎం జి యెన్ ఆర్ ఈ జి ఎస్ , 15వ ఆర్ధిక కమిషన్ ఎస్ బి ఎం (జి ), సి ఎస్ ఆర్ నిధులను , స్థానికి ప్రాంతాల అభివృద్ధి నిధులను సక్రమంగా అవసరమైన మేరకు ఉపయోగించడానికి వీలు ఉంటుంది.

ప్రణాళికల రూపకల్పన, అమలులో ప్రజలను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో గ్రామ/ గ్రామ పంచాయతీలలో కమిటీలను నెలకొల్పుతారు. ఈ కమిటీలు నీటి సరఫరా, నీటి సరఫరా వ్యవస్థలు ఎక్కువ కాలం పనిచేసేలా చూసి గ్రామీణ ప్రాంతాలలో మంచి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకొంటాయి. కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి గ్రామ పంచాయతీ సభ్యులకు ఇతరులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వారి నైపుణ్యాలను పెంపొందించాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇటువంటి శిక్షణా కార్యక్రమాల వల్ల నీటి సరఫరా వ్యవస్థల అమలు, నిర్వహణకు అవసరమైన నిపుణులు అందుబాటులో ఉంటారు

***

 



(Release ID: 1667287) Visitor Counter : 163