సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ ఫిర్యాదుల విధానాన్ని కేంద్ర ఫిర్యాదుల పోర్టల్‌తో అనుసంధానించారు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 23 OCT 2020 7:24PM by PIB Hyderabad

జమ్మూ-కశ్మీర్ ఫిర్యాదుల విధానాన్ని కేంద్ర ఫిర్యాదుల పోర్టల్‌తో అనుసంధానించబడిందనీ, తద్వారా జిల్లా స్థాయి ఫిర్యాదుల కార్యాలయాలను సి.పి.జి.ఆర్.ఏ.ఎమ్.ఎస్. కు చెందిన కేంద్ర ప్రభుత్వ పోర్టల్ (సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) తో అనుసంధానించిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా ఇది గుర్తింపు పొందిందనట్లైందని, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), పి.ఎం.ఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ తెలియజేశారు.  

జమ్మూ-కశ్మీర్‌ లో పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న ముఖ్యమైన ప్రయత్నాల్లో భాగంగా, కేంద్ర ఫిర్యాదుల మంత్రిత్వ శాఖలోని పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డి.ఏ.ఆర్.పి.జి) ఆన్ ‌లైన్ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ పోర్టల్ ‌ను విస్తరించడానికి మరియు స్థాపించడానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్ తో కలిసి పనిచేసింది. వరుస చర్చల తరువాత, మూడు నెలల్లో, జమ్మూ-కశ్మీర్ - ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (జె.కె-ఐ.జి.ఆర్.ఏ.ఎం.ఎస్) ను యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ-కశ్మీర్ లోని జిల్లా స్థాయి కార్యాలయాలతో మరియు సెంట్రల్ పోర్టల్ తో అనుసంధానించారు. 

జిల్లాల్లో నమూనాగా,  పైలట్ దశను అమలు చేయడానికి మరియు వాటిని సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఫిర్యాదుల పోర్టల్‌తో అనుసంధానించడానికి భారత ప్రభుత్వంలోని ప్రజా ఫిర్యాదుల విభాగం,  జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత  ప్రభుత్వంతో కలిసి పనిచేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.  

జిల్లా పోర్టల్ ‌ను రాష్ట్రంతో మరియు జాతీయ పోర్టల్‌తో అనుసంధానించిన మొట్టమొదటి ప్రయోగం యొక్క విజయవంతమైన కథగా డాక్టర్ జితేంద్ర సింగ్, దీన్ని అభివర్ణిస్తూ,  ఈ విధానాన్ని, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అనుసరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

<><><>


(Release ID: 1667204) Visitor Counter : 136