వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లిపాయల లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకున్న చర్యలు
ఉల్లిపాయల నిల్వపై విధించిన పరిమితి అక్టోబర్ 23, 2020 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిబంధన ప్రకారం టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నులు, చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల వరకూ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి 31-12-2020 వరకు అమలులో ఉంటుంది.
బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయల సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
Posted On:
23 OCT 2020 4:57PM by PIB Hyderabad
సెప్టెంబర్ రెండవ వారం నుండి పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను గమనించిన ప్రభుత్వం ఆ మేరకు నియంత్రణ చర్యలు తీసుకుంది. ఈ ధరలను రోజువారీ ప్రాతిపదికన గమనించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
నిత్యవసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 ప్రకారం ధరల నియంత్రణ కోసం నిల్వలపై పరిమితి విధించే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అఖిల భారత స్థాయిలో గమనిస్తే 21.10.2020 నాటికి ధరల పెరుగుదల 22.12% ( కిలోకు రూ .45.33 నుండి / 55.60 రూపాయల) మరియు గత 5 సంవత్సరాలతో పోలిస్తే 114.96% (రూ. 25.87 నుండి 55.60 వరకు) ఉంది. గత 5 సంవత్సరాల సగటుతో పోల్చినప్పుడు ధరలు 100% కంటే ఎక్కువ పెరిగాయి. అందువల్ల నిత్యవసర వస్తువులు (సవరణ) చట్టం ప్రకారం ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధన ప్రకారం టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నులు, చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల వరకూ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి 31-12-2020 వరకు అమలులో ఉంటుంది.
ఖరీఫ్ సాగు మార్కెట్‌లోకి రాకముందు ధరల పెరుగుదలను నియంత్రించడంతో పాటు దేశీయంగా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడానికి ఉల్లి ఎగుమతులపై 14.09.2020 నిషేధాన్ని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకుంది. ఈ చర్యలు రిటైల్ ధరల పెరుగుదలను కొంతవరకు నియంత్రించాయి. అయితే ఉల్లి పంట అధికంగా సాగయ్యే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది. ఆ వర్షాల కారణంగా ఖరీఫ్ పంటకు నష్టం వాటిల్లింది.
వాతావరణ పరిస్థితులు ఉల్లిపాయల ధరలు గణనీయంగా పెరగడానికి దోహదపడ్డాయి. ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి రబీ-2020 స్టాక్ నుండి ఉల్లిపాయల సరఫరాను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత ఏడాదితో పోలిస్తే అది రెట్టింపుగా స్టాక్‌ను ప్రభుత్వం సరఫరా చేసింది. కేంద్రం బఫర్ స్టాక్ నుండి దేశంలో ప్రధాన మార్కెట్లతో పాటు సరఫరా దారులకు నిల్వలను తరలించింది. వాటిలో కేంద్రీయభండార్, ఎన్సిసిఎఫ్, తన్హోడా & టాన్ఫెడ్ (తమిళనాడు ప్రభుత్వం) మరియు ప్రధాన నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం అస్సాం, మరియు కేరళ (హార్టికల్చర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)లకు రిటైల్ విధానంలో సరఫరా చేయబడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ ప్రభుత్వాలు కూడా ఉల్లిపాయల సరఫరా కోసం తమ విజ్ఞప్తిని. వాటిని కూడా పంపుతున్నారు.
బహిరంగా మార్కెట్‌లో విక్రయాల కోసం ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఇది మరింతగా దోహద పడుతోంది.
37 ఎల్‌ఎమ్‌టిల ఖరీఫ్ సాగు మార్కెట్‌లకు రావడం ప్రారంభమయితే వాటి లభ్యత పెరగడంతో పాటు ధరలు కూడా అదుపులోకి వస్తాయన్న అంచనా ఉంది.
మార్కెట్లలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి వాటి దిగుమతిని సులభతరం చేయడానికి 21.10.2020 న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్లాంట్ క్వారైంటైన యాక్ట్ ప్రకారం డిసెంబర్ 15, 2020 వరకూ దిగుమతుల్లో ఫైటోసానిటరీ సర్టిఫికెట్ అదనపు డిక్లరేషన్ పై ప్రభుత్వం నిబంధనలు సడలించింది.
మన దేశానికి ఉల్లిపాయలను ఎక్కువగా దిగుమతి చేసుకునే వ్యాపారులను భారత హైకమిషన్లు సంప్రదిస్తున్నాయి. భారతదేశానికి సముద్రం ద్వారా లేదా భూ మార్గంగా ద్వారా దిగుమతి చేసుకోవడానికి పీఎస్‌సీలపై ఫమిగ్రేషన్ మరియు ఎండార్స్‌మెంట్‌ల సడలింపులు ఇచ్చారు. తద్వారా అదనపు రుసుములు లేకుండా దిగుమతులు అనుమతిస్తారు. తద్వారా వినియోగించడానికి మాత్రమే వాటిని దిగుమతి చేసుకుంటున్నామన్న దిగుమతి దారులు ఒప్పందం ఇస్తే చాలు. అలాగే నాన్ కంప్లైన్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ పీక్యూ ఆర్డర్-2003 ప్రకారం దిగుమతులపై నాలుగు శాతం రుసుములను కూడా వసూలు చేయరు.
ప్రైవేటు వ్యాపారుల దిగుమతిని సులభతరం చేయడమే కాకుండా, డిమాండు సరఫరా అంతరాన్ని తీర్చడానికి ఎర్ర ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలని ఎంఎంటీసీ నిర్ణయించింది.
అత్యవసర వస్తువుల నిర్వహణ చట్టం 1980 ప్రకారం నల్లబజారులో అమ్మకాలను నిరోధించడానికి, అక్రమ నిల్వలను అరికట్టడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకుంటున్నాయి.
***
(Release ID: 1667135)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam